Bengaluru water crisis: హోటల్స్ లో నో సాంబార్; ఇక టాయిలెట్స్ పరిస్థితి దారుణం!!

బెంగళూరులో నీటి సమస్య మరింత తీవ్రమైంది. గుక్కెడు నీళ్ల కోసం బెంగళూరు వాసులు నానా తిప్పలు పడుతున్నారు. తాగునీటి సమస్య బెంగళూరు ను దాహార్తికి గురిచేస్తుంది. నీటి వినియోగంపై ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టినా, బెంగళూరు వాసులు జాగ్రత్తగా నీటిని వినియోగించుకోవాలని భావించినా, నీళ్లు మాత్రం దొరకని పరిస్థితి ఇక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది.

బెంగళూరులో నీటి కటకట
స్నానాలు చేయాలన్నా, ఇంట్లో పని చేసుకోవాలన్నా నీటి వినియోగం పై ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి బెంగళూరు వాసులకు వచ్చింది. ఆఖరుకు టాయిలెట్ కు వెళ్లాలన్న నీటి వృధాని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే బెంగళూరులో తాగునీటి కొరత కారణంగా చాలా వరకు బిజినెస్ దెబ్బతింది.

Bengaluru water crisis The situation in hotels is worse

హోటల్స్ లో పరిస్థితి ఇలా
నీటి కొరతతో చిన్న చిన్న హోటల్స్ మూతపడ్డాయి. పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్లినా నీళ్ల విషయంలో జాగ్రత్తపడటం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. హోటల్స్ లో పెట్టిన మెనూలో కూడా సాంబార్, రసం వంటి నీటితో తయారుచేసే ఆహారాలు దొరకడం లేదు. హోటల్స్ లో టాయిలెట్ కి వెళ్ళాలి అన్నా టోకెన్ సిస్టమ్ పెడుతుండటం గమనార్హం. బెంగళూరులో ఉన్న నీటి సమస్య తీవ్రతకు తాజాగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి.

టిష్యూ పేపర్లతో తుడుచుకుంటున్న బెంగుళూరు వాసులు
ఇప్పటికే బెంగళూరులో జీవిస్తున్న ఇతర ప్రాంతాల వారు నీటి ఎద్దడిని తట్టుకోలేక తమ సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. నీటి ఎద్దడితో చాలా సంస్థలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసిందిగా సూచిస్తున్నారు. ఇక ఇళ్ళలో కూడా నీటికి ఇబ్బంది పడుతున్నారు జనం. ఇక చేతులు కడుక్కోవాలి అంటే కూడా నీళ్లకు బదులు టిష్యూ పేపర్లతో తుడుచుకుంటూ మమ అనిపిస్తున్నారు.

పదిరోజులకోసారి త్రాగునీరు
ప్రస్తుతం బెంగళూరులో పది రోజులకు ఒకసారి నీటి సరఫరాను బెంగళూరు మహానగర పాలక సంస్థ చేపడుతుంది. నీటి వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని కేవలం బ్రతకడానికి, గొంతు తడుపు కోవడానికి మాత్రమే నీటిని ఉపయోగించాలని పదేపదే అధికార యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+