కూల్ డ్రింక్‌లో మత్తు మాత్రలు రేప్ చేసిన డాక్టర్
బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి కూల్ డ్రింక్ లో మత్తు మాత్రలు కలిపి తన మీద అత్యాచారం చేశాడని యువతి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళూరులో ప్రభుత్వ వైద్యుడిగా పని చేస్తున్న సురేష్ కుమార్ అనే డాక్టర్ మీద బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్ లో నివాసం ఉంటున్న యువతికి పెద్దలు వివాహ సంబంధాలు చూశారు. మంగళూరులోని వైద్యుడు సురేష్ కుమార్ గత సంవత్సరం మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా యువతిని పరిచయం చేసుకున్నాడు. నచ్చితే వివాహం చేసుకుంటానని చెప్పాడు.
తాను ప్రభుత్వ వైద్యుడిగా పని చేస్తున్నానని సురేష్ కుమార్ యువతికి చెప్పాడు. తనకు ముందే వివాహం అయ్యిందని, మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని అన్నాడు. మీకు నచ్చితే పెళ్లి చేసుకుంటానని సురేష్ కుమార్ చెప్పాడు.
అప్పటి నుండి ఇద్దరు మొబైల్ లో మాట్లాడుకుంటున్నారు. ఒక సారి మీరు బెంగళూరు వస్తే నేరుగా కలుసుకుని మాట్లాడుకుందామని యువతి చెప్పింది. సురేష్ కుమార్ బెంగళూరు రావడంతో ఒకరికి ఒకరు నచ్చడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించారు. యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు.

సురేష్ కుమార్ 2014 ఆగస్టు 8వ తేదిన యువతిని మంగళూరులోని కంకనాడిలోని తన ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. ఆ సమయంలో కూల్ డ్రింక్ లో మత్తు మాత్రలు వేసి తన మీద అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మొదటి భార్యకు విడాకులు ఇచ్చినా ఇద్దరు కలిసే ఉంటున్నారని యువతి గుర్తించి సురేష్ కుమార్ తో గొడవ పెట్టుకుంది. వివాహం చేసుకొవాలని చెబితే అందుకు సురేష్ కుమార్ అంగీకరించలేదని, ఇంతకు ముందు ఇదే విధంగా తాను అనేక మంది యువతులో జల్సా చేశానని అంటున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రూ. ఒక లక్ష ఇస్తాను తీసుకుని వెళ్లు, పోలీసు కేసు అంటూ తిరిగితే రౌడిలకు చెప్పి నిన్ను హత్య చేయిస్తానని సురేష్ కుమార్ బెదిరించాడని యువతి పోలీసులకు చెప్పింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మంగళూరులో ఈ సంఘటన జరిగినందు వలన అక్కడి మహిళ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలి చేశామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications