బెంగళూరు ఆంటీ హత్య: తల్లీ, కూతురు, లవర్ మందు పార్టీ, కోడికూర, వ్యభిచారం, డబ్బు!

బెంగళూరు: బెంగళూరు నగరంలోని చామరాజపేట ఐదవ క్రాస్ లో నివాసం ఉంటూ హత్యకు గురైన విజయ అలియాస్ విజయమ్మ (50) హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు విచారణ చేసిన పోలీసులు విజయను హత్య చేసిన వారి వివరాలు తెలుసుకుని షాక్ కు గురైనారు. విజయ, పెంపుడు కుమార్తె, ఆమె ప్రియుడు కలిసి మందు పార్టీ చేసుకున్న తరువాత వారి చేతిలోనే హత్యకు గురైయ్యిందని గురువారం పోలీసులు చెప్పారు.

వేశ్యవాటిక

వేశ్యవాటిక

చామరాజపేటలో నివాసం ఉంటున్న విజయ అలియాస్ విజయమ్మ (50) చాల సంవత్సరాల నుంచి వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తోంది. విజయ సైతం ఇప్పటి వరకు వ్యభిచారం చేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కుమార్తెకు అదే పని

కుమార్తెకు అదే పని

విజయ గత 21 ఏళ్ల క్రితం సోనూ పూజారి అనే యువతిని పిలుచుకునివచ్చి సొంత కూతురిలాగా పెంచుకుంటున్నది. సోనూ పూజారికి 12 ఏళ్లు వయసు ఉన్న సమయంలోనే విజయ వ్యభిచారం ఉచ్చులోకి దింపింది. సోనూ పూజారి కూడా పెంపుడు తల్లిలాగే వేశ్యవాటిక కేంద్రంకు చేరింది.

మొగుడుతో వెళితే !

మొగుడుతో వెళితే !

కొన్ని సంవత్సరాల క్రితం పంజాబ్ కు చెందిన యువకుడిని ప్రేమించిన సోనూ పూజారి అతన్ని వివాహం చేసుకుంది. సోనూ పూజారి భర్తతో కలిసి పంజాబ్ వెళ్లి పోయింది. తరువాత భర్త సోనూ పూజారిని పంజాబ్ లో వేశ్యవాటిక కేంద్రంలో పెట్టి వ్యభిచారం చేయించి డబ్బు సంపాధించడం మొదలుపెట్టాడు.

7 ఏళ్లు తక్కువ వయసు

7 ఏళ్లు తక్కువ వయసు

భర్త వేదింపులు తట్టుకోలేని సోనూ పూజారి కొంతకాలం క్రితం బెంగళూరు చేరుకుని పెంపుడు తల్లి విజయతో కలిసి ఉంటోంది. తరువాత తనకంటే 7 ఏళ్ల వయసు తక్కువ ఉన్న కుమార్ అనే యువకుడిని ప్రేమించిన సోనూ పూజారి ఇళ్లు వదిలిపారిపోయింది.

తల్లి డబ్బు కోసం

తల్లి డబ్బు కోసం

తనతో వ్యభిచారం చేయించి సంపాధించిన డబ్బులో వాటా ఇవ్వాలని సోనూ పూజారి పెంపుడు తల్లి విజయకు చెప్పింది. డబ్బు ఇవ్వడానికి విజయ నిరాకరించింది. ఈ విషయంలో పెంపుడు తల్లి మీద కోపం పెంచుకున్న సోనూ పూజారి బెంగళూరలో బ్యూటీప్యార్లల్ లో పని చేస్తూ ప్రియుడు కుమార్ తో కలిసి ఉంటోంది.

తల్లీ, కూతురు మందు పార్టీ

తల్లీ, కూతురు మందు పార్టీ

మంగళవారం మద్యాహ్నం చికెన్ తీసుకుని ప్రియుడు కుమార్ తో కలిసి సోనూ పూజారి తల్లి విజయ ఇంటికి వచ్చింది. విజయ, సోనూ పూజారి కలిసి కోడికూర, రాగిముద్ద చేశారు. అదే సమయంలో కుమార్ బార్ కు వెళ్లి విస్కీ, బీర్లు తీసుకు వచ్చాడు.

పీకలదాకా విస్కీ తాగి !

పీకలదాకా విస్కీ తాగి !

సోనూ పూజారి, ఆమె పెంపుడు తల్లి విజయ, కుమార్ కలిసి పీకలదాక విస్కీ, బీర్లు తాగారు. తరువాత కోడికూర, రాగి ముద్ద తిన్నారు. అనంతరం సోనూ పూజారి డబ్బులు ఇవ్వాలని విజయను డిమాండ్ చేసింది. ఆ సమయంలో గొడవ జరడంతో సోనూ పూజారి, కుమార్ కలిసి బీర్ బాటిళ్లు, రోకలి తీసుకుని విజయ తల మీద దాడి చేసి చంపేశారు.

ఇల్లు లూటీ, పీజీలో మకాం

ఇల్లు లూటీ, పీజీలో మకాం

విజయను హత్య చేసిన తరువాత ఇంటిలోని బంగారు నగలు, నగదు లూటీ చేసి ఎవరో దుండగులు హత్య చేశారని పోలీసులను నమ్మించాలని సోనూ పూజారి, కుమార్ ప్రయత్నించారు. కేసు నమోదు చేసిన పోలీసులు చామరాజపేట సమీపంలోని పీజీలో తలదాచుకున్న సోనూ పూజారి, ఆమె ప్రియుడు కుమార్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+