బెంగళరు స్వామీజీ, నటి రాసలీలల వీడియో: మఠంలో విచారణ చేస్తున్న శ్రీ శ్రీశైలం స్వామీజీ!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని హుణసమారనహళ్ళిలోని మద్దవణాపుర జంగమ మఠం స్వామీజీ శివాచార్య స్వామీజీ కుమారుడు దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ, కన్నడ నటి రాసలలీల వీడియో వ్యవహారంపై భక్తులు ఆందోళన కొనసాగిస్తునే ఉన్నారు.

శివాచార్య స్వామీజీ కుటుంబ సభ్యులు అందర్నీ మఠం నుంచి బయటకు పంపించేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు. సమస్య పరిష్కారం చెయ్యడానికి శ్రీశైలం మఠం, రంభాపుర జగద్గురు జోక్యం చేసుకున్నారు. భక్తుల నుంచి వివరాలు, వారి డిమాండ్లు తెలుసుకోవాలని నిర్ణయించారు.

BengaluruMaddevanapura mutt Dayananda scandal Sri Shaila Seer visit to mutt

శనివారం శ్రీశైలం మఠాధిపతి శ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య స్వామీజీ బెంగళూరు నగర శివార్లలోని మద్దేవణాపుర జంగమ మఠం చేరుకుని భక్తులతో మాట్లాడుతున్నారు. దయానంద అలియాస్ గురునంజేశ్వర స్వామీజీ, కన్నడ నటి రాసలీలల విషయంపై భక్తులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.

BengaluruMaddevanapura mutt Dayananda scandal Sri Shaila Seer visit to mutt

500 ఏళ్ల చరిత్ర ఉన్న మంఠంకు చెడ్డపేరు తీసుకు వచ్చిన వారు ఎవ్వరూ ఇక్కడ ఉండటానికి వీళ్లేదని, మీరు న్యాయం చెయ్యాలని భక్తులు శ్రీశైలం మఠం స్వామీజీకి మనవి చేశారు. భక్తలు, ట్రస్టీ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్న శ్రీశైలం మఠాధిపతి శ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య స్వామీజీ అంతిమతీర్మానం తీసుకుంటారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Maddevanapura mutt seer Dayananda sex scandal, Srishaila Seer Channasiddarama Panditaradhaya Shivacharya visits to Mutt on Saturday. The Channasiddarama seer discusses with mutt trust and he will take final decision today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి