2019 ఐపీఎల్ మ్యాచ్‌లను బెట్టింగ్ ప్రభావితం చేసింది..పాక్ నుంచి ఇన్‌పుట్స్: సీబీఐ
క్రీడల్లో బెట్టింగ్ కామన్ అయిపోయింది. ముఖ్యంగా క్రికెట్‌లో అయితే చెప్పక్కర్లేదు.. అందులో టీ20 ఫార్మాట్ వచ్చాక బెట్టింగ్ జోరుగా జరుగుతుంది. ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ ద్వారా భారీగా నగదు చేతులు మారుతుంది. అయితే 2019 ఐపీఎల్‌కు సంబంధించి సీబీఐ కీలక విషయం తెలియజేసింది. 2019 ఐపీఎల్‌కు సంబంధించి రెండు కేసులను కూడా ఫైల్ చేసింది.

మ్యాచ్‌లు ప్రభావితం
ఐపీఎల్ మ్యాచ్‌లను బెట్టింగ్ నెట్ వర్క్ ప్రభావితం చేసిందట. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఇన్ ఫుట్ ఆధారంగా సీబీఐ పేర్కొంది. దీనికి సంబంధించి ఢిల్లీలో నాలుగు లోకెషన్లు, రాజస్థాన్, హైదరాబాద్‌లో కూడా సంబంధం ఉందనే ఆరా తీస్తోంది. బెట్టింగ్ చేసి ప్రజలను మోసం చేస్తారని.. ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.

తప్పుడు పత్రాలు
నిందితులు తప్పుడు ధృవపత్రాలతో బ్యాంకు ఖాతాలు కూడా ఓపెన్ చేశారని పేర్కొన్నారు. కేవైసీలో తప్పుడు పత్రాలు సమర్పించేవారు. అందులో ఉన్న వివరాలు అన్నీ తప్పుడువే.. డేట్ ఆఫ్ బర్త్, ఇతర అంశాలు అన్నీ తప్పుగా ఇచ్చేవారు. బెట్టింగ్ చేసి.. హవాలా ద్వారా విదేశాలకు నగదు తరలించేవారట. 2013 నుంచి క్రికెట్ బెట్టింగ్ ఉందని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ అధికారులు రాశారు.

రూ.43 లక్షలు
ఢిల్లీకి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తి లావాదేవీలపై అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన గుర్రం సతీశ్, దిలీప్.. పాకిస్థాన్‌కు చెందిన వక్వాస్ మాలిక్‌తో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇద్దరి వద్ద పాకిస్థానీ నంబర్ ఉందని చెప్పారు. 2013లో దిలీప్ రూ.43 లక్షల నగదు డిపాజిట్ చేశారు. ఇలాంటి అభియోగాలపై రాజస్థాన్‌కు చెందిన సజ్జన్ సింగ్, ప్రభులాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్ శర్మకు కూడా సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications