వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాస్‌పోర్ట్, ఐడెంటిటీపట్ల జాగ్రత్త: ఐసిస్ అపహరించొచ్చు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్, ఇతర గుర్తింపు కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాస్‌పోర్టులు, ఐడెంటిటీలు అపహరించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు, అపహరించి ఐడెంటిటీ ద్వారా ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొచ్చుకొచ్చే ప్రమాదం కూడా ఉంది.

అపహరించిన ఐడెంటిటీ ద్వారా చొచ్చుకొచ్చిన ఉగ్రవాదులు... ఇక్కడ గూఢచర్యం చేసిన సందర్భాలు గూడా వెలుగు చూశాయి. పాస్‌‍పోర్టులను అపహరించడం క్రమంగా పెరుగుతోందని చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం సమాచారం మేరకు పద్దెనిమిది వందల పాస్‌పోర్టులను అపహరించారు.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) గతంలో ఇండో - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తొమ్మిది పాస్‌పోర్టులను సీజ్ చేసింది. దాంతో పెద్ద ఐసిస్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ పాస్‌పోర్టులు కోల్‌కతా, పాట్నా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ప్రింట్ చేసినట్లుగా తెలుస్తోంది.

 Beware Indians, the ISI may steal your passport and identity

అక్కడి నుంచి దొంగతనంగా బంగ్లాదేశ్ పంపిస్తారు. బంగ్లాదేశ్ నుంచి సౌదీ అరేబియాకు చేరుకుంటాయి. అక్కడ ఐసిస్ ఉగ్రవాద ఏజెంట్లు వాటిని తీసుకుంటారు.

వాటితో భారత్‌లోకి చొరబడుతారు. ఈ పాస్‌పోర్టుల ద్వారా వారు వచ్చి.. గూఢచర్యం చేస్తారు. ఈ పాస్‌పోర్టులు పాకిస్తాన్‌లో కూడా ప్రింట్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులో బిఎస్ఎఫ్ జవాన్లు కొందరిని చెక్ చేస్తుండగా ఈ విషయం వెలుగు చూసింది. తొమ్మిది మందికి చెందిన పాస్‌పోర్టులను వారు పరిశీలించారు. వాటి పైన సౌదీ అరేబియా వీసా స్టాంప్ ఉంది. విచారణలో అవి కోల్‌కతా, పాట్నా, జార్ఖండ్‌లలో ప్రింట్ అయినట్లుగా తేలింది.

English summary
Be careful with your passport. There have been cases of passports and identification thefts and investigations show that it is being used to facilitate the entry of ISI agents into India to carry out espionage activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X