వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిస్వార్థ సేవ: బెజ్‌వాడ విల్సన్, కృష్ణకు రామన్ మెగసెసె అవార్డులు

|
Google Oneindia TeluguNews

మనీలా/న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి గానూ ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. వారిలో ఒకరు మానవ హక్కుల కార్యకర్త బెజ్‌వాడ విల్సన్‌ కాగా, మరొకరు సంగీత విద్వాంసులు టీఎం కృష్ణ.

ఆసియాలో నిస్వార్థ సేవాపరులను గౌరవించటానికి ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రామన్‌ మెగసెసె పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ప్రతీ సంవ్తసరం అందజేస్తారు.

Bezwada Wilson, T M Krishna Win Ramon Magsaysay Award

ఈయేటి విజేతలైన బెజ్‌వాడ విల్సన్‌ కర్ణాటకలోని దళిత కుటుంబంలో జన్మించారు. మానవహక్కుల కోసం పోరాడే ఆయన హుందాగా జీవించడం ప్రతి మనిషికి జన్మతో వచ్చిన హక్కు అని చాటి చెప్పారు.

కాగా, చెన్నైకి చెందిన టీఎం కృష్ణ సంగీత విద్వాంసులు. సంస్కృతిలో సామాజికాంశాలను సమ్మిళితం చేయడాన్ని ఆయన ఇష్టంగా చేస్తారు. వీరితోపాటు మరికొందరిని కూడా ఈ అవార్డు వరించింది.

ఫిలిప్పీన్స్‌కి చెందిన కొంచిత కార్పియోమోరల్స్‌, ఇండోనేషియాకు చెందిన డంపెట్‌ దౌఫా తమ తమ రంగాల్లో చేస్తున్న సేవలకు, జపాన్‌, వియత్నాంలకు చెందిన మరో రెండు సంస్థలకు కూడా ఈ అవార్డులు వరించాయి.

English summary
Karnataka-born Bezwada Wilson, a prolific campaigner for eradication of manual scavenging in India, and Carnatic singer T M Krishna from Chennai, were today chosen for the prestigious Ramon Magsaysay Award for 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X