శరణార్థుల పాలిట దేవుడు.. మోదీని ప్రశంసల్లో ముంచెత్తిన మాజీ సీఎం

జాతీయ పౌరసత్వ నమోదు(NRC)చట్టంపై ఓవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నా.. మరోవైపు బీజేపీ మాత్రం దూకుడుగా
ముందుకెళ్లేందుకే ప్రయత్నిస్తోంది. ఎన్ఆర్‌సీతో బీజేపీ దేశంలో విభజన రాజకీయాలు చేయాలనుకుంటోందని విపక్షాలు విమర్శిస్తోంటే..
బీజేపీ మాత్రం ఈ చట్టం ఏ ఒక్క మతానికీ వ్యతిరేకం కాదని చెబుతోంది. అంతేకాదు, శరణార్థులుగా భారత్‌కి వలసొచ్చిన పొరుగు దేశాల మైనారిటీలకు
పౌరసత్వాన్ని కల్పిస్తున్న మోదీ దేవుడితో సమానమని అంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోదీని
దేవుడితో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్ఆర్‌సీ అమలుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన చౌహాన్.. పాక్,బంగ్లా,ఆఫ్ఘన్ దేశాల్లో వివక్ష,హింసను అనుభవించి
భారత్‌లో శరణార్థులుగా ఉన్న వలసదారుల పట్ల మోదీ దేవుడిగా అవతరించారని అభిప్రాయడ్డారు. తల్లి జన్మనిస్తుందని,భగవంతుడు జీవితాన్ని ఇస్తాడని,
కానీ నరేంద్ర మోదీ ఆ శరణార్థులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడని ప్రశంసించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడారు.

Bhagwan ne janam,modi ne zindagi shivraj singh chouhan compares pm to god

కాగా,ఎన్ఆర్‌సీపై విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, ఈ దేశ పౌరులకు దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో
జరిగిన సభలో మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. డిటెన్షన్ క్యాంపులు అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు,ఒకప్పుడు బెంగాల్‌లోకి బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలు ఆపాలని కోరిన మమతా బెనర్జీ.. ఇప్పుడెందుకు స్వరం మార్చారని ఆయన ప్రశ్నించారు.
ఏదేమైనా ఎన్ఆర్‌సీ పట్ల ఎంత వ్యతిరేకత వ్యక్తమయినా బీజేపీ తన స్టాండ్ నుంచి పక్కకు తప్పుకునే సూచనలు కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+