పంజాబ్ ఐఏఎస్ లకు కేజ్రివాల్ పాఠాలు-సమర్ధించుకున్న భగవంత్ మాన్
పంజాబ్ లో తాజాగా కొలువుదీరిన ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నడిపిస్తున్నారు. తొలిసారి సీఎం పదవి చేపట్టిన భగవంత్ మాన్ కు తగు సూచనలు చేస్తున్నారు. అంతే కాదు ఆయన ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులతో సైతం కేజ్రివాల్ టచ్ లో ఉంటున్నారు. ఇది కాస్తా వివాదాస్పమదవుతోంది.
తాజాగా పంజాబ్ కు చెందిన కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తో భేటీ అయ్యారు. దీంతో పొరుగు రాష్ట్రానికి చెందిన సీఎంతో తమ రాష్ట్ర ఐఏఎస్ లు భేటీ కావడంపై విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. దీన్ని సీఎం భగవంత్ మాన్ తేలిగ్గా కొట్టిపారేశారు. కేజ్రివాల్ తో పంజాబ్ ఐఏఎస్ లు భేటీ కావడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదన్నారు. తానే ఒక కారణం కోసం అధికారులను కేజ్రివాల్ వద్దకు పంపినట్లు మాన్ స్పష్టం చేశారు.

అధికారులను ఢిల్లీకి ఎందుకు పంపారో ప్రజలకు ఏప్రిల్ 16న శుభవార్త వస్తుందని అన్నారు. ఎక్కడైనా నేర్చుకోవలసిన మంచి ఏదైనా ఉంటే, తన అధికారులను అక్కడికి పంపడానికి సిద్ధంగా ఉన్నానని, అది ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లేదా తమిళనాడు అంటూ తేల్చిచెప్పేశారు. తన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కొద్దిరోజుల క్రితం న్యూఢిల్లీలో శిక్షణ కోసం వెళ్లారని సీఎం మాన్ తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు హల్ చల్ చేస్తున్నాయని నిందించిన మాన్, అవసరమైనప్పుడు వారి పరిపాలనా నైపుణ్యాలు, నైపుణ్యాన్ని మెరుగుపర్చడానికి తన అధికారులను పంపుతానని చెప్పారు. విద్య, ఆరోగ్యం, విద్యుత్ రంగంలో ఢిల్లీ ప్రభుత్వం చేసిన సంస్కరణలు సాటిలేనివని, వారి నుండి శిక్షణ పొందడం వల్ల ఎటువంటి నష్టం లేదని ఆయన అన్నారు.
పంజాబ్ లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం ఢిల్లీ తరహాలోనే మంచిపేరు తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఐఏఎస్ అధికారులతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ .. ఢిల్లీ మోడల్ పై అధ్యయనం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాద్ధాంతం చేస్తున్న విపక్షాలకు ఏప్రిల్ 16వరకూ ఆగాలని మాన్ సూచిస్తున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications