విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ బంద్ పాక్షికం: చిన్నారి ప్రాణంతీసిన బంద్! పెట్రోల్-డీజిల్‌పై చంద్రబాబు కీలక నిర్ణయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, విపక్షాలు సోమవారం (10-9-2018) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రూపాయి విలువ పతనం, ప్రపంచ చమురు ధరల పెరుగుదల నడుమ ఆదివారమూ వీటి పెంపు కొనసాగింది. పెట్రోలుపై లీటరుకు 12 పైసలు, డీజిలుపై 10 పైసలు వరకూ పెంపు కనిపించింది. చమురు ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు ఈ రోజు భారత్ బంద్‌ను నిర్వహించాయి.

బంద్ పాక్షికంగా విజయవంతమైంది. కాంగ్రెస్ పార్టీతో పాటు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీఎస్ సహా 21 ప్రధాన విపక్షాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు బంద్‌లో పాల్గొన్నాయి. ఏపీలో వైసీపీ మినహా మిగతా పార్టీలు బందులో పాల్గొన్నాయి. బంద్ రోజే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పైన వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది రేపటి నుంచి అమలులోకి రానుంది.

చదవండి: బస్సులు తిప్పితే తీవ్రపరిణామాలు, కేసీఆర్ కనుమరుగు ఖాయం: భారత్ బంద్‌పై విహెచ్

Bharat Bandh against Petrol and diesel price hike live updates

Newest First Oldest First
3:43 PM, 10 Sep

భారత్ బంద్ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రో ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాట్ తగ్గిస్తూ శాసన సభలో చంద్రబాబు ప్రకటన చేశారు. తగ్గిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్, డీజీల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.1120 కోట్ల భారం పడుతుంది.
3:28 PM, 10 Sep

కాంగ్రెస్‌ ఇచ్చిన బంద్‌ పిలుపును ఎవరూ పట్టించుకోవట్లేదని, వారి మహాకూటమి బెలూన్‌ త్వరలోనే పేలిపోతుందని బీజేపీ నేతలు అంటున్నారు.
3:13 PM, 10 Sep

పెట్రో ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2:33 PM, 10 Sep

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్‌లో తెలుగుదేశం పార్టీ కూడా పాలుపంచుకొంది.
1:45 PM, 10 Sep

పెరిగిన పెట్రోల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట్లాడటం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
1:02 PM, 10 Sep

కాగా, రెండేళ్ల చిన్నారి మృతికి ట్రాఫిక్ జామ్ కారణం కాదని, కుటుంబ సభ్యులు ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరారని జెహనాబాద్ ఎస్డీవో చెప్పారు.
12:55 PM, 10 Sep

ఇటీవల హర్యానాలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన ర్యాలీ కారణంగా ఓ అంబులెన్స్ ముందుకు కదలలేక అప్పుడే పుట్టిన బేబీ చనిపోయారని, ఇప్పుడు బీహార్‌లో భారత్ బంద్ కారణంగా మరో రెండేళ్ల చిన్నారని చనిపోయారని మండిపడుతున్నారు.
12:53 PM, 10 Sep

పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. పలుచోట్ల నిరసనకారుల నిరసనలు హద్దుమీరాయి. వాహనాలను కాల్చుతున్నారు. పెట్రోల్ బంకులపై దాడులు చేస్తున్నారు. దుకాణాలను బలవంతంగా మూయించారు.
12:49 PM, 10 Sep

ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలపవచ్చునని, కానీ ఈ రోజు ఏం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకులపై దాడులు చేస్తున్నారని, బస్సులకు నిప్పు పెడుతున్నారని, తద్వారా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బీహార్‌లోని జెహనాబాద్‌లో పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా పలువురు ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారని, ఈ నిరసనలో అంబులెన్స్ నిలిచిపోయిందని, దీంతో ఓ చిన్నారి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు.
12:40 PM, 10 Sep

మోడీ ప్రభుత్వాన్ని మార్చే సమయం దగ్గరలో ఉందని మన్మోహన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కనబెట్టాలని, ఏకతాటిపై నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
12:40 PM, 10 Sep

ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశ ప్రయోజనాలకు అవసరం లేనివెన్నో చేసిందని, అన్ని పరిమితులు దాటిందని, ప్రజలు విసుగెత్తిపోయారని, రైతులు అసంతృప్తిలో ఉన్నారని, యువతకు ఉద్యోగాలు లేక ఆందోళన చెందుతున్నారని మన్మోహన్ సింగ్ అన్నారు.
12:38 PM, 10 Sep

ఢిల్లీలో జరిగిన భారత్ బంద్‌లో లెెఫ్ట్ పార్టీ నేతలు సీతారాం ఏచూరీ, డీ రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి పాల్గొన్నారు.
12:37 PM, 10 Sep

ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాన్ని ఎడ్ల బండి పైన తీసుకు వెళ్లి నిరసన తెలిపారు.
12:35 PM, 10 Sep

ఢిల్లీలో జరిగిన భారత్ బంద్ నిరసన కార్యక్రమంలో మరోసారి విపక్షాలు ఒకే వేదిక పైకి వచ్చాయి.
12:05 PM, 10 Sep

భారత్ బంద్ రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. విపక్షాలు భారత్ బంద్ నిర్వహిస్తుంటే బీజేపీ గర్విస్తున్నట్లుగా ఉందని, అవసరమైతే ద్రవ్యోల్భణం కూడా అభివృద్ధికి సూచిక అని చెబుతారేమో అన్నారు.
12:02 PM, 10 Sep

ఒత్తిడిలో ఉన్న కాంగ్రెస్, ఇతర విపక్షాలకు ఓ వ్యూహం, లీడర్‌షిప్ లేదని, అలాంటి వారి నుంచి మనం ఏం ఆశించగలమని, దేవుడు వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నానని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
12:01 PM, 10 Sep

భారత్.. బంద్ కాదని, భారత్ అభివృద్ధి ముందుకు సాగుతుందని, కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ పిలుపును ఎవరూ పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు.
11:54 AM, 10 Sep

విపక్షాలన్నీ కలిసి బీజేపీని గద్దె దించుదామని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
11:53 AM, 10 Sep

మహిళలపై దాడుల గురించి, పెరుగుతున్న పెట్రో ధరల గురించి, రైతుల సమస్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడం లేదని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు.
11:15 AM, 10 Sep

భారత్ బంద్‌లో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. ఉజ్జయినిలో కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ ఓ పెట్రోల్ బంకుపై దాడి చేసి, ధ్వంసం చేశారు.
11:14 AM, 10 Sep

ఎంఎన్ఎస్ కార్యకర్తలు బలవంతంగా దుకాణాలు మూయిస్తున్న దృశ్యం.
11:13 AM, 10 Sep

భారత్ బంద్‌లో భాగంగా లోకతంత్రిక్ జనతా దళ్ వర్కర్స్ తమ భుజాలపై మోటార్ బైక్‌ను మోసి నిరసన తెలిపారు.
11:11 AM, 10 Sep

మోడీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం దేశానికి ఉపయోగపడని ఎన్నో కార్యక్రమాలు చేసిందని మండిపడ్డారు.
11:10 AM, 10 Sep

ప్రశాంతంగా జరగాల్సిన భారత్ బంద్‌లో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. పాట్నాలో జన అధికార్ పార్టీ వర్కర్స్ పలు వాహనాలను ధ్వంసం చేశారు.
10:20 AM, 10 Sep

ముంబై అంధేరీ రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల రైల్ రోకో.
10:19 AM, 10 Sep

పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన భారత్ బంద్ నిరసనలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ యాదవ్ దృశ్యాలు.
10:18 AM, 10 Sep

చత్తీస్‌గఢ్‌లో పెట్రోల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ఇలా..
10:17 AM, 10 Sep

ఢిల్లీలో జరిగిన పెట్రో వ్యతిరేక ఆందోళనలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, శరద్ పవార్, శరద్ యాదవ్ తదితరులు.
9:37 AM, 10 Sep

జంగారెడ్డిగూడెంలో ఉదయం నుంచి బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఆర్టీసి డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.
9:36 AM, 10 Sep

నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జైపూర్ పోలీసులు తెలిపారు.
READ MORE

English summary
Bharat Bandh Live Against Petrol Diesel Price Hike Congress Protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X