ఢిల్లీ ఎయిమ్స్‌లో కోవాగ్జిన్ మూడో బూస్టర్ డోసు ట్రయల్స్ ప్రారంభం

హైదరాబాద్: భారత్ బయోటెక్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఇప్పటికే మనదేశంలో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కోవాగ్జిన్.. కరోనా మహమ్మారిపై సమర్థవంతంగా పనిచేస్తున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ బూస్టర్ డోసుపై ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభించింది. బూస్టర్ డోసుల అవసరం ఉందని అంతర్జాతీయ వైద్య నిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ ట్రయల్స్‌ను వేగవంతం చేస్తోంది.

కోవాగ్జిన్ బూస్టర్ డోసు ప్రయోగాలను భారత్ బయోటెక్ ప్రారంభించింది. ఇందుకోసం దాదాపు 190 మందిపై ఆరు నెలలపాటు అధ్యయనం చేపట్టనున్నారు. వ్యాక్సిన్ మూడో డోసు (బూస్టర్ డోసు) ఫలితాలను తెలుసుకునేందుకు.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సోమవారం నుంచి ప్రయోగాలను మొదలుపెట్టింది. ఇందు కోసం రెండు, మూడు దశల ప్రయోగాల్లో భాగంగా 6 నెలల క్రితం వ్యాక్సిన్ తీసుకున్న 190 మందిపై ప్రయోగాలను నిర్వహించనున్నారు.

Bharat Biotech begins trials for third booster dose of Covaxin at AIIMS

దేశ వ్యాప్తంగా తొమ్మిది ప్రదేశాల్లో బూస్టర్ డోసు ప్రయోగాలను చేస్తున్నట్లు ప్రయోగ నిర్వాహకులు తెలిపారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న 190 మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మూడో డోసు తీసుకున్న తర్వాత మరో 6 నెలలపాటుపై వీరిని పర్యవేక్షించనున్నారు.

కాగా, బూస్టర్ డోసు ప్రయోగాల కోసం సబ్జెక్టు నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) నుంచి భారత్ బయోటెక్ ఇప్పటికే అనుమతి పొందిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగాల్లో భాగంగా కోవాగ్జిన్ రోగనిరోధక సామర్థ్యం, దుష్ప్రభావాలు, వ్యాక్సిన్ సురక్షితం తదితర అంశాలను అంచనా వేయనున్నారు. జనవరి 16 నుంచి మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.

Recommended Video

    Yellow Fungus Cases Reported In UP | Oneindia Telugu

    ఇప్పటి వరకు 2 కోట్ల డోసులను అందించినట్లు సమాచారం. కోవాగ్జిన్ తోపాటు కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు వ్యాక్సిన్లతోపాటు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ కూడా పంపిణీ చేస్తున్నారు. త్వరలో ఫైజర్ వ్యాక్సిన్‌ను కూడా భారత్ లో పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+