bharat rice: భారత్ రైస్ కిలో 29రూపాయలే; త్వరలో మార్కెట్లోకి.. ప్రకటించిన కేంద్రం!!
బియ్యంలో 15 శాతం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన చెందుతున్న మధ్యతరగతి ప్రజలకు కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం ఒకింత ఊరట ఇస్తుంది. భారత్ రైస్ పేరుతో 29 రూపాయలకే కిలో బియ్యం విక్రయించనున్నట్లు కేంద్రం పేర్కొంది.
ఇక ఈ బియ్యాన్ని ఫిబ్రవరి రెండోవారం నుండి మార్కెట్లోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ధరలను తగ్గించాలని రైస్ మిల్లర్లకు విజ్ఞప్తి చేసినా ఆశించిన ఫలితాలు ఇవ్వని కారణంగా కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు తగ్గకపోతే ముందు ముందు బియ్యం ఎగుమతిపై పూర్తి నిషేధం ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం సూచించింది.

ఏడాది క్రితం ఉన్న బియ్యం ధరలకు ఇప్పటి బియ్యం ధరలకు చాలా వ్యత్యాసం ఉందని, రిటైల్ మార్కెట్లో 14.5%, హోల్ సేల్ మార్కెట్లో 15.5 శాతం ధరలు పెరిగాయని వెల్లడించింది. ఇప్పటికే ప్రతి శుక్రవారం బియ్యం నిల్వలకు సంబంధించిన సమాచారం అందించాలని వ్యాపారాలకు సూచించిన కేంద్రం, ధరల నియంత్రణలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ రైస్ పేరుతో వ్యాపారం మొదలు పెట్టనున్న కేంద్రం ఈ కామర్స్ సైట్ లలో కూడా భారత్ రైస్ ను విక్రయించనునట్లు పేర్కొంది. ప్రస్తుతం భారత్ రైస్ 5 ,10కిలోల ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది. మొదటి దశలో రిటైల్ మార్కెట్లో విక్రయించడం కోసం ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నారు.
నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కన్జ్యూమర్ కోపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే సెంట్రల్ రెండు సహకార సంఘాల ద్వారా రిటైల్ మార్కెట్లో సబ్సిడీతో కూడిన భారత్ రైస్ ను అందించనున్నాయి. ఏది ఏమైనా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.












Click it and Unblock the Notifications