ఉదయం 11 నుంచి 3 వరకు సకలం బంద్: జనానికి ఇబ్బంది కలిగించబోం, భారతీయ కిసాన్ యూనియన్
మరికొన్ని గంటల్లో భారతీయ కిసాన్ యూనియన్ భారత్ బంద్ చేపట్టబోతోంది. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదు. దీంతో నిరసనకు పిలుపునిచ్చింది. బంద్ చేసే సమయాన్ని కూడా యూనియన్ తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి బంద్ ప్రారంభమవుతోందని వెల్లడించింది. నాలుగుగంటల పాటు.. అంటే మధ్యాహ్నం 3 గంటలకు బంద్ ముగిస్తామని వివరించింది. తమ బంద్ వల్ల సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.

ఉదయం 11 గంటలు
బంద్ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతోందని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ తెలిపారు. దీంతో ఆఫీసులకు వెళ్లేవారు నిరభ్యరంతంగా వెళ్లొచ్చని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు బంద్ ముగిస్తామని వెల్లడించారు. ఆ సమయం వరకు చాలా కార్యాలయాలు విధుల్లో ఉంటాయని తెలిపారు. 3 తర్వాత అన్నీ యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత సాధారణంగా ఉండటంతో.. జనం బయట తిరగొచ్చు అన వెల్లడించారు.

అంబులెన్స్, పెళ్లిళ్లకు ఓకే..
అత్యవసర సర్వీసులు అంబులెన్స్‌లకు అనుమతిస్తామని రాకేశ్ చెప్పారు. ఇప్పటికే నిర్ణయించడం వల్ల పెళ్లిళ్లకు కూడా పర్మిషన్ ఉంటుందని చెప్పారు. వారిని ఇబ్బందికి గురిచేయాలని అనుకోవడం లేదన్నారు. డిమాండ్లపై తమ నిరసనను శాంతియుతంగా కొనసాగిస్తామని తెలిపారు. తమకు అన్నీ వర్గాలు సహకరించాలని కోరారు. నిరసన వ్యక్తం చేయడానికి బంద్‌ను ఓ పద్ధతిగా మాత్రమే ఎంచుకున్నామని స్పష్టం చేశారు. బంద్ చేసి తమ ఆవేదనను మాత్రమే తెలుపుతున్నాం.. తప్ప మరో ఉద్దేశ్యం లేదన్నారు.

అంగీకరించం
కేంద్రం తీసుకొచ్చిన విధానాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని స్పష్టంచేశారు. దీనిపై రాజీలేకుండా పోరాడుతామని చెప్పారు. 3 వ్యవసాయ చట్టాలు, పంటలకు కనీస మద్దతు ధర కోసం వారు పట్టుబడుతున్నారు. కానీ వీటిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో భారత్ బంద్ చేపట్టాల్సి వచ్చిందని రాకేశ్ తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గితే.. బంద్‌పై పునరాలోచన చేసేవారమన్నారు. కానీ అలాంటి పరిస్థితి మాత్రం లేదన్నారు.












Click it and Unblock the Notifications