Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భీమా కోరేగావ్ కేసు: ఆనంద్ తేల్‌తుంబ్డేకు బెయిల్.. అమలుపై వారం రోజులు స్టే

భీమా కోరేగావ్‌ కేసులో నిందితుడిగా జైలులో ఉన్న ఆనంద్ తేల్‌తుంబ్డేకు బాంబే హైకోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో కోర్టు ఈ బెయిల్ ఇచ్చింది.

అయితే.. బెయిల్ మంజూరు నిర్ణయంపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయటానికి గడువు ఇవ్వాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విజ్ఞప్తి చేయటంతో.. హైకోర్టు ఈ ఉత్తర్వు అమలు మీద వారం రోజులు స్టే విధించింది.

భీమాకోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆనంద్ తేల్‌తుంబ్డే 2020 ఏప్రిల్ 14వ తేదీన ఎన్ఐఏ ఎదుట లొంగిపోయారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మానవ హక్కుల ఉద్యమకారుడు గౌతమ్ నవలఖా కూడా ఆ తరువాత ఎన్ఐఏ సమక్షంలో లొంగిపోయారు.

గౌతమ్ నవలఖాకు ఆరోగ్య కారణాల రీత్యా నెల రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచటానికి సుప్రీంకోర్టు గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గృహ నిర్బంధంలో ఉంచటానికి భద్రతా చర్యల కోసం అయ్యే ఖర్చులకు గాను రూ. 2.4 లక్షలు ముందుగా డిపాజిట్ చెయ్యాలని నిర్దేశించింది.

ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావుకు కూడా.. సుప్రీంకోర్టు కొన్ని నెలల కిందట ఆయన వయసు, ఆనారోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇచ్చింది.

తాజాగా తేల్‌తుంబ్డేకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఆనంద్ తేల్‌తుంబ్డే

ఆనంద్ తేల్‌తుంబ్డే ఎవరు?

దళిత ఉద్యమాలతో సంబంధమున్న ప్రముఖ మేధావి ఆనంద్ తేల్‌తుంబ్డే. యావత్‌మల్ జిల్లా రాజూర్‌లో ఆయన జన్మించారు. నాగపూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదివారాయన. కొన్ని ఉద్యోగాలు చేసిన తరువాత ఐఐఎం, అహ్మదాబాద్‌లో చేరారు. అక్కడ పలు అంశాలపై అధ్యయనం చేసిన ఆయన ఆ తరువాత కార్పొరేట్ రంగంలోనూ పలు సంస్థల్లో కీలక స్థానాల్లో పనిచేశారు.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా, పెట్రోనెట్ ఇండియా ఎండీగానూ పనిచేశారు.

ప్రస్తుతం గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగి.

అనేక పత్రికలు, మ్యాగజీన్లకు ఆర్టికల్స్ రాసిన ఆయన ఇప్పటివరకు 26 పుస్తకాలు రాశారు.

కార్పొరేట్ రంగంలోనే పనిచేసినప్పటికీ అనేక సామాజిక ఉద్యమాలలో పాలుపంచుకున్నారు.

పబ్లిక్ పాలసీ, కులం-వర్గం విశ్లేషణలకు సంబంధించిన ఆయన్ను నిపుణుడిగా చెబుతుంటారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కమిటీ (సీపీడీఆర్) జనరల్ సెక్రటరీగా ఉన్నారాయన.

భీమా కోరెగావ్

తేల్‌తుంబ్డేపై ఆరోపణలేమిటి?

2017 డిసెంబరు 31న నిర్వహించిన ఎల్గార్ పరిషత్, అక్కడికి ఒక రోజు తరువాత చెలరేగిన భీమా కోరెగావ్ హింసతో సంబంధం ఉందంటూ కొద్దిమంది మేధావులను, రచయితలను 2018 ఆగస్ట్ 28న అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల సమయంలోనే ఆనంద్ తేల్‌తుంబ్డే ఇంట్లో సోదాలు చేశారు.

పోలీసుల సోదాల సమయానికి తాను ఇంట్లో లేనని.. వారంట్‌ లేకుండానే ఇంట్లో సోదాలు చేసి, వీడియోలు తీసి మళ్లీ తాళాలు వేశారని ఆయన ఆరోపించారు. ఇదంతా జరిగినప్పటికి ఆయన ముంబయిలో ఉన్నారు. పోలీసులు అక్రమంగా తమ ఇంట్లో సోదాలు చేశారంటూ ఆయన భార్య గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2018 ఆగస్ట్ 31న అప్పటి అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ పరమ్ వీర్ సింగ్ పుణెలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఒక లేఖ చూపించారు. తేల్‌తుంబ్డే, అరెస్టయిన అయిదుగురు యాక్టివిస్టులకు భీమా కోరెగావ్ హింసతో సంబంధం ఉందనడానికి ఆ లేఖే ఆధారమని ఆయన చెప్పారు. ఒక కామ్రేడ్ ఆ లేఖ రాశారని పోలీసులు చెప్పారు.

''2018 ఏప్రిల్‌లో పారిస్‌లో ఒక సదస్సు జరిగింది. ఆనంద్ తేల్‌తుంబ్డేను అక్కడ ఇంటర్వ్యూ చేశారు. ఆ సదస్సుకు జరిగిన ఖర్చును మావోయిస్టులు భరించారు. ఆయన ఇంటర్వ్యూను వారే ఏర్పాటు చేశారు'' అని పోలీసులు ఆరోపించారు. ఆ సదస్సు నిర్వాహకులు ఈ ఆరోపణలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారని తేల్‌తుంబ్డే చెప్తున్నారు.

ఇదిలావుంటే.. తన మీద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ తేల్‌తుంబ్డే ముంబై హైకోర్టులో దరఖాస్తు సమర్పించారు. ఆయన మీద ఆరోపణలను వివరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని పోలీసులను కోరింది కోర్టు.

తన మీద చేసిన ఆరోపణలన్నిటినీ వ్యతిరేకిస్తూ తన న్యాయవాదులు వాదనలు వినిపించారని, తన మీద తీవ్ర నేరమేదీ మోపజాలరని నిరూపించారని తేల్‌తుంబ్డే చెప్పారు.

ఆనంద్ తేల్‌తుంబ్దె

ఈ కేసుకు సంబంధించిన పోలీసు పత్రాలు.. మద్రాసులోని ఐఐటీలో పెరియార్ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయటానికి 'ఆనంద్' అనే ఒక వ్యక్తి కారకుడని చెప్తున్నాయి.

''కానీ ఆ సమయంలో నేను ఖరగ్‌పూర్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్నాను. కాబట్టి ఇది సాధ్యం కాదు'' అంటున్నారు తేల్‌తుంబ్డే.

అనురాధ గాంధీ మెమోరియల్ కమిటీ సమావేశంలో తేల్‌తుంబ్డే కొన్ని 'మంచి' సూచనలు చేశారని కూడా పోలీసు పత్రాలు చెప్తున్నాయి. కానీ తాను చాలా సంవత్సరాలుగా ఈ కమిటీ సమావేశాలకు హాజరుకావటం లేదని ఆయన వివరణ ఇచ్చారు.

గడ్చిరోలిలో నిజ నిర్ధారణ కార్యక్రమం నిర్వహించటానికి బాధ్యుడు 'ఆనంద్' అని మరొక లేఖలో ప్రస్తావించారు. ''ఆ లేఖలో ప్రస్తావించిన 'ఆనంద్' నేనే అని ఎవరైనా అంగీకరించినా కూడా.. నేను కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (సీపీడీఆర్) సభ్యుడిని. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు అనుమానించే కేసుల్లో ఈ సంస్థ నిజనిర్ధారణ చేపడుతుంది. కానీ నిర్దిష్టమైన కమిటీ దేనినీ మేం ఏర్పాటు చేయలేదు'' అని ఆయన చెప్పారు.

'మిలింద్'కు ప్రతినిధ్యం వహించిన 'సురేంద్ర' అనే వ్యక్తి నుంచి ఆనంద్ తేల్‌తుంబ్డే రూ. 90,000 తీసుకున్నట్లు.. పాడైపోయిన టేప్ ఒకటి ప్రస్తావిస్తోంది.

భీమా కోరెగావ్

భీమా కోరేగావ్ కేసు ఏమిటి?

పుణె సమీపంలోని భీమా-కోరేగావ్ దగ్గర 2018 జనవరి 1న హింస చెలరేగింది. ఆ రోజున లక్షలాది మంది దళితులు ఇక్కడ సమావేశమవుతారు. ఆ హింస దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఆ హింసకు ఒక రోజు ముందు.. 2017 డిసెంబర్ 31న పుణెలో ఎల్గాన్ పరిషత్‌ను నిర్వహించారు. ఈ సదస్సులో చేసిన ప్రశంగాలు మరుసటి రోజు హింసను రాజేశాయని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు ప్రాతిపదికగా పుణె పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు.

ఎల్గార్ పరిషత్ వెనుక మావోయిస్టుల హస్తం ఉండటంతో పాటు ఈ మావోయిస్టు సంస్థలతో సంబంధం ఉందనే అనుమానాలతో.. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వామపక్ష వైఖరి గల ఉద్యమకారులు చేలా మందిని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యమకారులు న్యాయపోరాటం ప్రారంభించారు. ఆనంద్ తేల్‌తుంబ్డే, గౌత్ నవ్‌లఖాలు సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం వారు చేసిన వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వారు లొంగిపోవటానికి మూడు వారాల గడువు ఇచ్చింది. ఆ గడువు 2020 ఏప్రిల్ 14న ముగిసింది.

సుప్రీంకోర్టు

ఎల్గార్ పరిషత్ కేసులో దర్యాప్తు

తేల్‌తుంబ్డే దరఖాస్తును ముంబై హైకోర్టు ఫిబ్రవరిలో తిరస్కరించిన తర్వాత.. ఆయన సుప్రీంకోర్టకు అప్పీలు చేసుకున్నారు. ఆయన వినతిని ఆలకించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు ఇవ్వటానికి నిరాకరించింది. జతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎదుట లొంగిపోవాలని ఆయనకు చెప్పింది. ఆయన పాస్‌పోర్టును దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కూడా నిర్దేశించింది.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసులో వాదనలను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఆ చట్టంలోని సెక్షన్ 43డి (4) ప్రకారం.. ఇటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని చెప్పింది.

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. గౌతమ్ నవ్‌లఖా ఒక ప్రకటన విడుదల చేశారు. ''నేను ఇప్పుడు మూడు వారాల లోపు స్వయంగా లొంగిపోవాల్సి ఉంది కనుక.. మరొక కుట్ర కేసుగా నాకు కనిపిస్తున్నట్లు.. ఇటువంటి కేసుల పొడవైన జాబితాలో మరో కేసును నేను ఎదుర్కోకుండా ఉంటానని ఆశించే ధైర్యం చేయగలనా? సహ నిందితులు, వారివంటి ఇతరులకు వారి స్వాతంత్ర్యం మళ్లీ తిరిగి వస్తుందా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా'' అని అందులో పేర్కొన్నారు.

''పౌర స్వేచ్ఛలను అంతకంతకూ అణచివేస్తున్న కాలంలో మనం నివసిస్తున్నందున ఈ ప్రశ్నలు తొలచివేస్తున్నాయి. ఒక సంస్థను నిషేధించటానికి, దాని సిద్ధాంతాన్ని చట్టవ్యతిరేకమని ప్రకటించటానికి ఈ భయానక యూఏపీఏ చట్టం వీలు కల్పిస్తోంది. దాని ఫలితంగా.. అత్యంత నిరపాయకరమైన, చట్టబద్ధమైన కార్యకలాపాలు.. రాజ్యం దృష్టిలో నేరపూరితంగా మారగలవు. విచారణ, తీర్పు కోసం వేచికుండా.. ఆ ప్రక్రియనే శిక్షగా చేస్తున్న చట్టం ఇది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

నిరసన

గౌతమ్ నవ్‌లఖా, తేల్‌తుంబ్డేలు కలిసి ఉన్నారా?

గౌతమ్ నవ్‌లఖా ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత, పాత్రికేయుడు. ఆనంద్ తేల్‌తుంబ్డే ప్రముఖ దళిత రచయిత, మేధావి.

భీమా-కోరేగావ్ కేసులో పుణె పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత 2018లో కొంతమంది ఉద్యమకారులను అరెస్ట్ చేశారు. నవ్‌లఖాను దిల్లీలోని ఆయన నివాసంలో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆనంద్ తేల్‌తుంబ్డే గోవాలోని ఒక మేనేజ్‌మెంట్ విద్యా సంస్థలో బోధిస్తున్నారు.

తన మీద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరారు తేల్‌తుంబ్డే. అందుకు కోర్టు నిరాకరించటంతో.. ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

పుణె కోర్టు ఆయన దరఖాస్తును తిరస్కరించిన తర్వాత.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఇంకా మిగిలి ఉండటంతో ఆయనను తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

వరవరరావు, గౌతమ్ నవలాఖా

గౌతమ్ నవ్‌లఖా గురించి...

గౌతమ్ నవ్‌లఖా ఒక పాత్రికేయుడు, మానవ హక్కుల కార్యకర్త. భీమా-కోరేగావ్ కేసుకు సంబంధించి ఆయన మీద పుణెలోని విశ్రామ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

అరెస్ట్‌ను నివారించటానికి ఆయన పలు ప్రయత్నాలు చేశారు. ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దరఖాస్తులు చేశారు. కోర్టులు వాటిని తిరస్కరించాయి. ఆనంద్ తేల్‌తుంబ్డేతో పాటు తననూ అరెస్ట్ చేస్తారని ఆయన కూడా భయపడుతున్నారు.

ఎనిమిది సంవత్సరాల కిందట.. మావోయిస్టుల నుంచి ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన ఐదుగురు సిబ్బందిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నవ్‌లఖా మీద యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చటం వంటి ఇతర ఆరోపణలూ ఉన్నాయి.

ఈ ఆరోపణలన్నిటినీ నవ్‌లఖా తిరస్కరించారు. వామపక్ష తీవ్రవాదానికి, హింసకు తాను వ్యతిరేకమని ఆయన చెప్పారు.

గౌతమ్ నవ్‌లఖా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్ సంస్థకు కార్యదర్శిగా పనిచేశారు. కశ్మీర్‌లో మానవ హక్కులు, న్యాయం మీద ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్‌కు కన్వీనర్‌గా కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+