singer: ఫేమస్ సింగర్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు, నేను ఎవ్వరికీ భయపడను, ఏం చేస్తారు !

వివాదాస్పద పాటలు పాడటం. సెటైర్ పాటలు పాడటంలో ప్రసిద్ది చెందిన ప్రముఖ సింగర్ నేహా సింగ్ రాథోడ్ కు యూపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేను ఎవ్వరికి భయపడను అంటూ సింగర్ కౌంటర్ ఇచ్చారు.

లక్నో/ఉత్తరప్రదేశ్: వివాదాస్పద పాటలు పాడటం. సెటైర్ పాటలు పాడటంలో ప్రసిద్ది చెందిన ప్రముఖ భోజ్ పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో నోటీసులకు సరైన సమాధానం చెప్పకపోతే మీ మీద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సింగర్ నేహాసింగ్ రాథోడ్ కు పోలీసులు హెచ్చరించారు. నేను ఎవ్వరికి భయపడను, ఏం చేస్తారో చేసుకోండి అంటూ సింగర్ పోలీసులకు కౌంటర్ ఇచ్చారు. ఫేమస్ సింగర్ నేహాసింగ్ కు ఉప ముఖ్యమంత్రితో పాటు, మాజీ సీఎం మద్దతుగా నిలవడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.

 ఏం జరిగిందంటే ?

ఏం జరిగిందంటే ?


ఇటీవల ఉత్తరప్రదేశ్ లో అక్రమ కట్టడాలు, గుడిసెలను ప్రభుత్వ అధికారులు తొలగించారు. ఆ సందర్బంలో కాన్పూర్ లో మా ఇంటిని తొలగించడానికి వీలులేదని అడ్డుపడిన ప్రమీలా దీక్షిత్ (45), ఆమె కుమార్తె నేహా (20) మరణానికి దారితీసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరును ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులతో పాటు దేశ వ్యాప్తంగా కొందరు రాజకీయ నాయకులు ఖండించారు. తల్లీకూతురు మరణానికి ఉత్తరప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం భాద్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఓ పాటతో విమర్శించిన నేహాసింగ్

ఓ పాటతో విమర్శించిన నేహాసింగ్


వివాదాస్పద పాటలు పాడటం. సెటైర్ పాటలు పాడటంలో ప్రసిద్ది చెందిన ప్రముఖ భోజ్ పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కాన్పూర్ పోలీసులు, అధికారుల తీరును విమర్శిస్తూ ఓ పాటపాడారు. ప్రమీలా దీక్షిత్, ఆమె కూతురు నేహా మరణానికి అధికారులే కారణం అంటూ విమర్శిస్తూ సింగర్ నేహాసింగ్ రాథోడ్ పాట పాడటమే కాకుండా ఆ పాటను యూట్యూబల్ లో అప్ లోడ్ చెయ్యడంతో వైరల్ అయ్యింది.

ప్రజల్లో అలజడి రేపిన పాట

తల్లీ, కూతురు మరణాన్ని ఎండగడుతూ 'ఉత్తరప్రదేశ్ లో ఏముంది ' అనే అర్థం వచ్చేలా సింగర్ నేహా సింగ్ రాథోడ్ పాడిన పాట యూట్యూబ్ లో వైరల్ అయ్యింది. ప్రజల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మీరు పాట పాడి దానిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారని, మీరు ఎందుకు ఇలా చేశారో మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని, అలా చెయ్యకపోతే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ భోజ్ పురి సింగర్ నేహాసింగ్ రాథోడ్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

నేను ఎవ్వరికి భయపడను

నేను ఎవ్వరికి భయపడను

ఉత్తరప్రదేశ్ నోటీసులు ఇవ్వడంతో సింగర్ నేహాసింగ్ స్పంధించారు. తాను ఎవ్వరికి భయపడను, ఇలాంటి నోటీసులు నా గొంతు నొక్కలేవు. చట్టపరంగా నేను ముందుకు వెలుతానని సింగర్ నేహాసింగ్ రాథోడ్ అన్నారు. తల్లీకూతురు మరణానికి అక్కడి అధికారులు కారణం కాదా అని నేహాసింగ్ ప్రశ్నించారు. తన జరిగిన సంఘటనను పాట రూపంలో ప్రజలకు చెప్పానని, తాను ఎవరిని టార్గెట్ చేసి ఈ పాట పాడలేదని జానపద గాయని నేహాసింగ్ రాథోడ్ స్పష్టం చేశారు.

 మాజీ సీఎం, డిప్యూటీ సీఎం

మాజీ సీఎం, డిప్యూటీ సీఎం

సింగర్ నేహాసింగ్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆ రాస్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం చివరికి సింగర్ ల మీదపడిందని ఎద్దేవ చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పాప బీజేపీ ఒక్క సింగర్ దెబ్బకు ఉలిక్కిపడిందని ఎద్దేవ చేశారు. భోజ్ పురి సింగర్ నేహాసింగ్ రాథోడ్ కు మేము మద్దతుగా ఉంటామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+