ఏమీ భూపతి.. బైక్ కోసం 2 లక్షలకు పైగా చిల్లర పోగేశాడు.. షోరూం సిబ్బంది అపసోపాలు

చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. అవును కొందరు అలా చేస్తుంటారు. అంటే వారు చేసే పని మంచి ఉద్దేశంతో అయినా.. వార్తల్లో నిలుస్తుంటారు. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు కూడా అలానే చేశాడు. కానీ అతని వల్ల షోరూం సిబ్బంది.. 10 గంటలు కష్టపడ్డారు. బైక్ కొనాలనేది అతని మూడేళ్ల డ్రీమ్.. బైక్ కోసం డబ్బులు కూడబెట్టాడు. అయితే అన్నీ చిల్లర నాణేలే.. రూపాయి నాణాలను మూడేళ్లుగా సేకరిస్తూ వచ్చాడు. రూ.2.6 లక్షలు పోగేశాడు. ఆ చిల్లరతో నేరుగా బైక్ షోరూం వద్దకు చేరుకుని తనకు నచ్చిన కొత్త బజాజ్ డామినార్ బైక్ కొనుగోలు చేశాడు.

 డ్రీమ్ ఇలా..

డ్రీమ్ ఇలా..


తమిళనాడు సేలంకు చెందిన భూపతి బైక్ కొనాలనే డ్రీమ్ ఇలా నెరవేర్చుకున్నాడు. బైక్ షోరూంకు నాణేలలో చేరుకున్నాడు. రూపాయి నాణేలను లెక్కించలేక షోరూం సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అతను తీసుకొచ్చిన చిల్లర నాణేలను లెక్కించేందుకు 10 గంటల సమయం పట్టింది. ఈ మేరకు భారత్ ఏజెన్సీ మేనేజర్ మహావిక్రాంత్ తెలిపారు.

 బీసీఏ చేసి..

బీసీఏ చేసి..


భూపతి బీసీఏ చేశాడు. నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించే ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. బైక్ ఖరీదు రూ.2 లక్షలు ఉంది. తన డ్రీమ్ బైక్ కొనాలని డిసైడ్ అయ్యాడు. మూడేళ్ల క్రితం నుంచే ఒక రూపాయి నాణేలను సేకరించాడు. రూ.2లక్షలపైగా పోగోయ్యాక ఆ చిల్లర నాణేలతో బైక్ షోరూంకు వెళ్లి నచ్చిన బైక్ కొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 10 గంటలు అంటే

10 గంటలు అంటే


భూపతి చేసింది.. మూమ్మాటికీ కరెక్టే.. కానీ చిల్లర లెక్కబెట్టలేక షోరూం సిబ్బంది తెగ ఇబ్బంది పడ్డారు. అవును స్టాప్ మొత్తం కూర్చొని.. 10 గంటల పాటు లెక్కిస్తే కానీ కొలిక్కి రాలేదు. అంటూ డ్యూటీ అవర్స్.. ఒకరోజు.. అంతకన్నా ఎక్కువే పట్టింది. ఉదయం 9 గంటలకు వచ్చినా సాయంత్రం 7 గంటలకు లెక్కింపు ప్రక్రియ పూర్తయిపోయింది. ఆ తర్వాత అతనికి బైక్ డెలివరీ చేశారు. అప్పుడు అతని ఆనందానికి అవది లేకుండా పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+