వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైకిల్ కోసం దాచుకున్న రూ.9వేలు వరద బాధితులకు, చిన్నారికి హీరో కంపెనీ బంపరాఫర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ వరద బాధితులకు తమిళనాడుకు చెందిన అనుప్రియ అనే చిన్నారి సైకిల్ కోసం దాచుకున్న తన రూ.9వేల మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. ఆమె ఈ సొమ్మును నాలుగేళ్లుగా దాచుకుంది. కేరళలో వరద బీభత్సం తెలిసిందే. దీంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ఎంతోమంది సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

కేరళ వరద పరిస్థితి, సహాయం గురించి టీవీలో చూసిన చిన్నారి అనుప్రియ నాలుగేళ్లుగా తాను సైకిల్ కొనేందుకు దాచుకున్న రూ.9వేలను వరద బాధితులకు ఇచ్చింది. ఆమె ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించింది. ఈ విషయం పేపర్లలో వచ్చింది. దీనిపై హీరో సైకిల్ కంపెనీ స్పందించింది.

Bicycle for girl who donated savings for Kerala flood victims

అనుప్రియను అభినందించింది. ఆమెకు కొత్త సైకిల్ బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం అనుప్రియను తమ ఈ మెయిల్‌కు అడ్రస్ పంపించాలని అడిగింది. ఇంతలోనే హీరో సైకిల్స్ ఎండీ పంకజ్ ముందా స్పందించారు. చిన్నారి అనుప్రియకు ప్రతి ఏటా ఓ సైకిల్ చొప్పున జీవితాంతం ఇస్తామని తెలిపారు.

Recommended Video

దయచేసి సహాయం చేయండి: యాంకర్ సుమ

శివసేన ప్రజాప్రతినిధుల సహకారం

కేరళ వరద బాధితులకు శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనం ఇచ్చారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు కూడా రూ.20 కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చాయి. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించాయి. తెలంగాణ పీసీసీ తరఫున కూడా ఆర్థిక సాయం అందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెల వేతనం ఇచ్చారు.

English summary
In a goodwill gesture, Hero Cycles on Saturday came forward to help a girl from Viluppuram, Tamil Nadu after she donated Rs 9000 towards the Kerala flood relief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X