విభజన: జివోఎం భేటీ, వేడెక్కిన ఢిల్లీ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన రాజకీయాలతో దేశ రాజధాని న్యూఢిల్లీ సోమవారం వేడెక్కింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సీమాంధ్ర నాయకులు, తెలంగాణ నాయకులు జీవోఎం ముందు విడివిడిగా హాజరయ్యారు. తమ తమ వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర గళం వినిపించారు. చాలా కాలం తెర వెనకే ఉండిపోయిన తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి తెర ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిన తీరుపై జైపాల్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ నేతలు తమ వాదనలు వినిపించారు.
సమైక్యవాదం వినిపించిన కిరణ్ కుమార్ రెడ్డి తన వాదనలను జివోఎం ముందే కాకుండా మీడియా ముందు కూడా వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర మాత్రమే కాకుండా తెలంగాణ కూడా నష్టపోతుందని ఆయన చెప్పారు. విభజన వల్ల హైదరాబాద్‌కు ముప్పు ఏర్పడుతుందని, నక్సలిజం పెరుగుతుందని ఆయన అన్నారు.
కాగా, సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ వాదనలను జివోఎం ముందు వినిపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజన అనివార్యమైతే సీమాంధ్ర సమస్యలను పరిష్కరించిన తర్వాతనే ముందుకు వెళ్లాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని వారు కోరారు. అయితే, వారితో విభేదిస్తూ మంత్రి కిశోర్ చంద్రదేవ్ విశాఖపట్నాన్ని సీమాంధ్రకు రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు.

జైపాల్ రెడ్డి నేతృత్వంలో ఇలా..
ఎస్ జైపాల్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కేంద్ర మంత్రులు సోమవారం కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) ముందు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీరు ఎలా ఉండాలో వారు జివోఎంకు వివరించారు.

పొన్నంతో సర్వే సత్యనారాయణ ఇలా..
జివోఎంతో భేటీ తర్వాత తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్‌తో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఇలా... ఇచ్చిన మాట ప్రకారమే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నారని సర్వే సత్యనారాయణ మీడియాతో అన్నారు.

మీడియాకు చెప్పం..
తాము జివోఎంకు తమ వాదనలతో నివేదికను అందజేశాం. ఆ నివేదికలోని అంశాలను వెల్లడించలేమని జైపాల్ రెడ్డి మీడియాతో అన్నారు. తమ నివేదికలోని ప్రధానాంశాలను ఆయన వివరించారు.

బలరాం నాయక్ వాదన
భద్రాచలాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని జివోఎంను కోరినట్లు కేంద్ర మంత్రి బలరాం నాయక్ చెప్పారు. భద్రాచలం ఎలా తెలంగాణకు సంబంధించిందో వివరించినట్లు ఆయన తెలిపారు.

మీడియా సమావేశంలో కిరణ్ రెడ్డి..
జీవోఎం ముందు హాజరైన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. విభజనను తాను జివోఎం ముందు తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెప్పారు. విభజన వల్ల జరిగే నష్టాన్ని కూడా వివరించినట్లు ఆయన తెలిపారు.

కిరణ్ రెడ్డి తీవ్ర స్వరం..
జివోఎంకు మీరు ఇచ్చిన నివేదిక సొంతంగానే ఇచ్చారా, ప్రభుత్వం తరఫున ఇచ్చారా అని ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కాస్తా తీవ్రంగానే ప్రతిస్పందించారు. ముఖ్యమంత్రిగానే తనను పిలిచారని, ముఖ్యమంత్రిగానే నివేదిక సమర్పించానని, దానికి మంత్రి వర్గ ఆమోదం అక్కర్లేదని ఆయన అన్నారు.

జీవోఎం ముందు ఇలా...
రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీవోఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తాను విభజనకు అంగీకరించబోనని ఆయన చెప్పారు. విభజన జరిగే నష్టాన్ని వివరిస్తూ పుస్తక రూపంలో తన నివేదికను సమర్పించారు.

పళ్లంరాజుతో చిరంజీవి ఇలా..
సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోమవారంనాడు రాష్ట్ర విభజనపై జివోఎం మందు హాజరయ్యారు. పళ్లంరాజు, చిరంజీవి జివోఎం సమావేశం సందర్భంగా ఇలా కనిపించారు.

పనబాక లక్ష్మి సపరేట్..
కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మొదటి నుంచి రాష్ట్ర విభజనను సమర్థిస్తున్నారు. తాను సమైక్యవాదినే అయినప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ బిల్లుకు ఓటేస్తానని చెప్పారు. జివోఎంతో సమావేశం సందర్భంగా కూడా రూటే సపరేట్ అన్నట్లుగా ఇలా..

జెడి శీలం ముందుకు, చిరు వెనక్కి...
జీవోఎంతో భేటీ తర్వాత సీమాంధ్ర కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు. చిరంజీవి కాస్తా వెనక్కి తగ్గి, జెడి శీలం ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి ఇలా..
జీవోఎంతో భేటీ అయిన తర్వాత బయటకు వస్తూ ముఖ్యమంత్రి ఇలా కనిపించారు. ఆయన సమైక్యవాదంపై దూకుడునే ప్రదర్శించారు.

ముఖ్యమంత్రి వాహనంలో ఇలా..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీవోఎం సమావేశానికి హాజరై వెనక్కి వెళ్లిపోతూ ఇలా కనిపించారు. మీడియా సమావేశం తర్వాత ఆయన హైదరాబాదుకు బయలుదేరారు.

టీజి వెంకటేష్ ఇలా..
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ సహచర మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు కృష్ణా రెడ్డిలతో కలిసి ఇలా..












Click it and Unblock the Notifications