రైతులకు GOOD NEWS.. పీఎం కిసాన్ నిధులు విడుదల..ఇలా చెక్ చేసుకోండి..!

రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ 19వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా 'పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి' కింద ఈ నిధులు విడుదల చేశారు. దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2వేల చొప్పున మొత్తం రూ. 22వేల కోట్లు జమ చేశారు.

రైతులకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం-కిసాన్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఏటా ఒక్కో విడత రూ.2,000 చొప్పున మూడువిడతల్లో రూ.6,000 సాయం అందిస్తోంది. పీఎం కిసాన్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు అందజేసింది.

Big Boost for Farmers PM Modi Releases 19th Tranche of PM Kisan Funds

ఈ మేరకు బిహార్‌లోని భాగల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి ప్రాజెక్ట్ లను జాతికి అంకితం చేశారు.

డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి.. ?

పీఎం కిసాన్ నిధులు మీ అకౌంట్ లో పడ్డాయో లేదో చెక్ చేసుకోవాడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ ఓపెన్ చేసి.. Know Your Status అనే ఆప్షన్​ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్​ నమోదు చేసి, క్యాప్ చా కోడ​్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత Get Data అనే ఆప్షన్ ​పై క్లిక్ చేస్తే స్క్రీన్ ​పై మీ బెనిఫిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+