Budget : మూలధన వ్యయం భారీగా పెంచిన నిర్మలమ్మ- 33 శాతం- 10 లక్షల కోట్లకు చేరిక
ఇన్ ఫ్రా రంగానికి భారీ ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచుతున్నట్లు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్డెట్ లో ప్రకటించారు.
దేశంలో రెవెన్యూ వ్యయం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మూలధన వ్యయంపై ఖర్చుపెట్టేందుకు ప్రభుత్వాలు వెనుకాడుతున్నాయి. దీంతో ఈ ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. దీనికి చెక్ పెట్టేలా మూల ధన వ్యయాన్ని భారీగా పెంచుతూ కేంద్రం ఈ బడ్జెట్ లో నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఖర్చుపెట్టే మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ ఇవాల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బడ్జెట్ లో ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. మూలధన వ్యయాన్ని ఏకంగా 33 శాతం పెంచుతూ నిర్మల ప్రకటన చేశారు. దీని ప్రకారం కేంద్రం వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పెట్టే మూలధన వ్యయం రూ.10 లక్షల కోట్లకు పెరిగినట్లయింది.

ప్రస్తుత ఆర్దిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్దిక సంవత్సరంలో ఏకంగా 7.5 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని కేంద్రం అదనంగా ఖర్చుపెట్టబోతోంది. అయితే ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో 35 శాతం మూలధన వ్యయాన్ని పెంచిన కేంద్రం.. ఈసారి మాత్రం కేవలం 33 శాతానికే సరిపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు 1.3 ట్రిలియన్ల దీర్ఘకాలిక రుణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.












Click it and Unblock the Notifications