Big fight: కాంగ్రెస్ ను చావు దెబ్బ కొట్టిన ఓవైసీ, ధమ్ బిర్యానీ దెబ్బతో ఢమాల్, బీజేపీకి భారీ లాభం !
హుబ్బళి/ధారవాడా/ బెంగళూరు: కర్ణాటకలోని హుబ్బళి-ధారవాడ జంట నగరాల కార్పోరేషన్ ఎన్నికల్లో అధిక స్థానాలను కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ కైవసం చేసుకునింది. హుబ్బళి-ధారవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తాచాటుకుని అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆశల మీద ఎంఐఎం (అసాదుద్దీన్ ఓవైసీ) చావు దెబ్బ కొట్టింది. ఊహించని విధంగా చివరి నమిషయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసాదుద్దీన్ ఓవైసీ టీమ్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చేయడంతో కాంగ్రెస్ పార్టీకి అక్కడ చావు దెబ్బ తగిలింది. హుబ్బళి-ధారవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఊహించని విదంగా మూడు వార్డుల్లో కైవసం చేసుకుంది. హైదరాబాద్ బిర్యానీ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ ఢమాల్ అయ్యింది. కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న వార్డులో సైతం ఎంఐఏం విజయం సాధించడంతో అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ అయ్యారు. ఎంఐఎం దెబ్బకు బీజేపీకి సినిమా కనపడుతుందని ఇంతకాలం బావించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊహించని ఎదురు దెబ్బ తగలడంతో ఆ పార్టీ నాయకుల అంచనాలు తల్లకిందులు అయ్యాయి.

బీజేపీ-కాంగ్రెస్ పోటాపోటీ
కర్ణాటకలోని హుబ్బళి- ధారవాడ జంట నగరాల కార్పోరేషన్ ఎన్నికలు రెండు పార్టీల మద్య హోరాహోరీగా జరిగాయి. నువ్వానేనా అంటూ అధికార పార్టీ బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ మద్య వాడివేడిగా ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చినా చివరి నిమిషంలో పరిస్థితులు తారుమారైయి.

కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టిన ఎంఐఎం
హుబ్బళి-ధారవాడ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం (అసాదుద్దీన్ ఓవైసీ), అమ్ ఆద్మీ పార్టీతో పాటు పలువురు స్వతంత పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. అయితే బీజేపీతో ఢీకొట్టిన కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీ కంటే ఎక్కువ ఎదురు దెబ్బలు తగిలింది మాత్రం ఎంఐఏం పార్టీతోనే. హుబ్బళి-ధారవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది.

82 వార్డుల్లో 420 మంది పోటీ
హుబ్బళి-ధారవాడ కార్పోరేషన్ లో మొత్తం 82 వార్డులు ఉన్నాయి. 82 వార్డుల్లో మొత్తం 420 మంది అభ్యర్థులు పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన హుబ్బళి-ధారవాడ ఎన్నికల్లో బీజేపీ 39 వార్డుల్లో, కాంగ్రెస్ పార్టీ 33 వార్డుల్లో, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు 6 వార్డుల్లో, ఏంఐఏం మూడు వార్డుల్లో, జేడీఎస్ పార్టీ ఒక వార్డులో విజయం సాధించింది.

కాంగ్రెస్ కు సినిమా చూపించిన ఎంఐఏం
హుబ్బళి-ధారవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తాచాటుకుని అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆశల మీద ఎంఐఎం (అసాదుద్దీన్ ఓవైసీ) చావు దెబ్బ కొట్టింది. ఊహించన విధంగా చివరికి నమిషయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసాదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చేయడంతో కాంగ్రెస్ పార్టీకి అక్కడ చావు దెబ్బ తగిలింది.

హైదరాబాద్ దమ్ బిర్యానీ దెబ్బతో ఢమాల్
హుబ్బళి-ధారవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఊహించని విదంగా మూడు వార్డుల్లో కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వార్డులో సైతం ఎంఐఏం విజయం సాధించడంతో అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ అయ్యారు. అయితే హుబ్భళి- ధారవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో 41 వార్డుల్లో పోటీ చేసిన అమ్ ఆధ్మీ పార్టీ అభ్యర్థులు ఒక్క వార్డులో కూడా విజయం సాధించకపోవడంతో ఆ పార్టీ నాయకులు షాక్ అయ్యారు. ఢీల్లీ పప్పులు హుబ్బళిలో ఉడకవు అని అక్కడి ప్రజలు అంటున్నారు.












Click it and Unblock the Notifications