వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nupur Sharma : నుపుర్ శర్మకు సుప్రీం భారీ ఊరట- విద్వేష వ్యాఖ్యల కేసులన్నీ ఢిల్లీకి బదిలీ

|
Google Oneindia TeluguNews

మొహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా విద్వేష వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నమోదైన అన్ని ఎఫ్ఐఆర్ లను ఢిల్లీకి బదిలీచేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు మన్నించింది. దీంతో ఈ కేసుల్ని ఇకపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు.

మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు గాను నూపుర్ శర్మపై దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 10 కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని, ఢిల్లీ పోలీసులు కేసును దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ లపై దర్యాప్తు చేసి వాస్తవాలు తేల్చబోతున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీలో పోలీసులు కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నుపుర్ శర్మ వ్యవహారంలో దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

big relief to former bjp leader nupur sharma-sc transfer hate speech cases to delhi police

నుపుర్ శర్మ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, "పిటిషనర్ ప్రాణాలకు, భద్రతకు తీవ్రమైన ముప్పు ఉందని ఈ కోర్టు ఇప్పటికే గుర్తించినందున, నూపుర్ శర్మపై ఉన్న అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసి, దర్యాప్తు కోసం క్లబ్ చేయాలని మేము ఆదేశిస్తున్నాము. అని తెలిపింది. ఆమెపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) విచారిస్తుంది.

Recommended Video

కుప్పకూలిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం *Politics | Telugu OneIndia

"ఈ కేసును తార్కిక ముగింపుకు తీసుకురావడానికి ఇతర పోలీసు బలగాల నుండి సహాయం తీసుకోవడానికి IFSO స్వేచ్ఛను కలిగి ఉంటుంది. విచారణ ముగిసే వరకు, నూపుర్ శర్మకు మంజూరైన మధ్యంతర రక్షణ పొడిగించబడుతుంది" అని బెంచ్ ఆమెకు కొనసాగించడానికి స్వేచ్ఛను ఇస్తూ పేర్కొంది. ప్రస్తుత మరియు భవిష్యత్ ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ఆమె హక్కులు మరియు పరిష్కారాలు కనుగొనాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

English summary
supreme court on today transfered hate speech cases recorded against nupur sharma to delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X