వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కు ఊరట : తగ్గుతున్న ఆర్ వాల్యూ, 3 లక్షలకు యాక్టివ్ కేసులు .. తాజా లెక్కలు ఇవే !!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసులు పరంపర కొనసాగుతూనే ఉంది. కానీ ఆర్ వాల్యూ 1 కంటే దిగువకు చేరుకోవటం భారీ రిలీఫ్ ఇస్తుంది. తాజాగా 30,000 కు దిగువనే నమోదైన కేసులు ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశంలో గత 24 గంటల్లో 26,964 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3.01 లక్షలకు తగ్గినట్లుగా తెలుస్తోంది. మంగళవారం నివేదించిన మరణాల సంఖ్య 383 కాగా ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4.45 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకు దేశంలో 3.35 కోట్ల మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

కేరళ కొంప ముంచిన ఓనం పండుగ ; కేరళ కరోనా కల్లోలంతో పండుగలపై కేంద్రం అలెర్ట్కేరళ కొంప ముంచిన ఓనం పండుగ ; కేరళ కరోనా కల్లోలంతో పండుగలపై కేంద్రం అలెర్ట్

 దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులు

దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో 15,92,395 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల కేసుల రేటు 0.90 శాతానికి తగ్గగా, అధిక వడ్డీ రేటు 97.77 శాతానికి పెరిగింది. కరోనా మహమ్మారి బారినుండి నిన్న ఒక్కరోజు 34 వేల మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 3.27 కోట్లకు చేరుకుంది.కేరళలో తాజాగా15,768 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, కేరళలోనే అత్యధిక రోజువారీ కేసులు నమోదు అవుతున్నాయి.

కేరళ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 1.61 లక్షలు

కేరళ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 1.61 లక్షలు

ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 1.61 లక్షలుగా ఉన్నాయి. కోవిడ్ -19 సంక్రమణ కారణంగా కేరళలో 214 మంది మరణించారు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు ఉన్న మహారాష్ట్రలో 3,131 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 70 కోవిడ్ మరణాలను కూడా నివేదించింది. 1,647 కోవిడ్ కేసులతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 1,179 కరోనా కేసులను, కర్ణాటక 818 కేసులను నమోదు చేశాయి . తెలంగాణలో ఒక రోజులో 244 కేసులు నమోదయ్యాయి.

కేరళలో పంజా విసురుతున్న డెల్టా వేరియంట్

కేరళలో పంజా విసురుతున్న డెల్టా వేరియంట్

కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం పదే పదే హెచ్చరిస్తోంది. ఒకపక్క కేరళ రాష్ట్రంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్నట్లుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రస్తుతం కొనసాగుతున్న పండగల సీజన్ లో కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మాస్కులు ధరించడం, సామాజిక దూరం నిబంధనలు పాటించడం తప్పనిసరిగా చేయాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని పేర్కొంది.

 దేశంలో పడిపోయిన ఆర్ విలువ

దేశంలో పడిపోయిన ఆర్ విలువ

భారతదేశంలో కోవిడ్-19 కొరకు ఆర్ - విలువ లేదా పునరుత్పత్తి సంఖ్య, ఆగష్టు-ముగింపులో 1.17 నుండి సెప్టెంబర్ మధ్యలో 0.92 కి పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంక్రమణ వ్యాప్తి మందగించిందని సూచిస్తుంది. అయితే, కొన్ని ప్రధాన నగరాల R- విలువలను చూస్తే ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులలో ఆర్ విలువ 1 కంటే ఎక్కువ కాగా, ఢిల్లీ మరియు పూణే యొక్క ఆర్ - విలువ 1 కంటే తక్కువగా ఉన్నాయి.

Recommended Video

PCB Chairman Ramiz Raja Reacts After England Cancel Pakistan Tour || Oneindia Telugu
టీకా మైత్రి క్రింద వ్యాక్సిన్స్ ఎగుమతి .. అక్టోబర్‌లో దాదాపు 22 కోట్ల మోతాదుల కోవిషీల్డ్‌ సరఫరా

టీకా మైత్రి క్రింద వ్యాక్సిన్స్ ఎగుమతి .. అక్టోబర్‌లో దాదాపు 22 కోట్ల మోతాదుల కోవిషీల్డ్‌ సరఫరా

"టీకా మైత్రి" కింద వచ్చే నాలుగో త్రైమాసికంలో మిగులు కోవిడ్ వ్యాక్సిన్‌ల ఎగుమతి ప్రారంభం అవుతుందని కేంద్రం ప్రకటించడంతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అక్టోబర్‌లో దాదాపు 22 కోట్ల మోతాదుల కోవిషీల్డ్‌ని సరఫరా చేయగలదని కేంద్రానికి తెలియజేసింది. ఇదిలా ఉంటే నిన్న 75,57,529 మందికి టీకా వేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పంపిణీ మొత్తం టీకా డోసుల సంఖ్య 82,65,15,754 గా నమోదైంది.

English summary
The corona epidemic continues to spread in India. There have been 26,115 latest coronavirus cases, 252 people died yesterday. It is estimated that 4,45,385 people in the country have died due to corona so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X