శరద్ పవార్ కు సుప్రీంకోర్టు భారీ షాక్- అజిత్ పవార్ కు బిగ్ రిలీఫ్..!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఇవాళ సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. ఆయన పార్టీకి ప్రస్తుతం ఉన్న గడియారం గుర్తును తన పార్టీ నుంచి చీలిపోయి వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ వర్గానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్సీపీ వర్గపోరులో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు భారీ ఊరట లభించినట్లయింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గడియారం గుర్తు అజిత్ పవార్ వర్గం వద్దే ఉంటుందని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. గతంలో ఎన్సీపి నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం తమకు మెజార్టీ నేతల మద్దతు ఉందని, కాబట్టి పార్టీ గుర్తు అయిన గడియారాన్ని తమకే కేటాయించాలని ఈసీని కోరింది. దీంతో ఈసీ కూడా వారికే కేటాయించింది. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శరద్ పవార్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అజిత్ వర్గం వాదనతో ఏకీభవించింది.

మరోవైపు నెల రోజుల్లోపే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు నిర్ణయం శరాఘాతంగా మారబోతంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గడియారం గుర్తులేకుండా దాదాపు 85 మంది పార్టీ అభ్యర్ధులు ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అసాధ్యమే. దీంతో ప్రత్యామ్నాయ గుర్తు, మార్గాలపై శరద్ పవార్ వర్గం దృష్టిసారించింది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ పేరు వాడొద్దంటూ గతంలో ఇచ్చిన తీర్పును అజిత్ పవార్ వర్గం పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications