చిక్కుల్లో రాహుల్ గాంధీ ? భారత్ జోడో యాత్రలో KGF 2 పాట వాడుకోవడంపై కాపీరైట్ కేసు..
బీజేపీ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు భారత్ జోడో యాత్ర చేస్తున్న యువనేత రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. కర్నాటకకు చెందిన ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ రాహుల్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై కాపీరైట్ వాజ్యం దాఖలు చేసింది. కేజీఎఫ్ సినిమాలోని అమ్మ పాటను అక్రమంగా జోడో యాత్ర వీడియోల్లో వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
భారత్ జోడో యాత్ర కోసం రూపొందించిన పాటల్లో కన్నడ సంచలనం కేజీఎఫ్ 2 చిత్రంలోని అమ్మ పాటను కాంగ్రెస్ పార్టీ వాడేస్తోంది. రాహుల్ గాంధీపై రూపొందిస్తున్న వీడియోల్లో ఈ పాటను తమ అనుమతి లేకుండా వాడుకోవడంతో ఈ పాటపై హక్కులు పొందిన ఎంఆర్టీ మ్యూజిక్ సంస్ధ రాహుల్ తో పాటు కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, సుప్రియా శ్రీనటేపై కాపీరైట్ వాజ్యం దాఖలు చేసింది. కాపీరైట్ చట్టం ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని ఈ వాజ్యంలో సదరు సంస్ధ కోరింది. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది.
आओ, तुम्हें 'सपनों के भारत' की ओर लेकर चलें...#BharatJodoYatra pic.twitter.com/4sZinLl8sS
— Congress (@INCIndia) October 11, 2022

కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ కోసం రూపొందించిన సాంగ్ కోసం తాము ఎంతో డబ్బు ఖర్చుపెట్టి కొనుగోలు చేశామని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఫ్రీగా వాడేసుకోవడమేంటని ఎంఆర్టీ మ్యూజిక్ సంస్ధ ప్రశ్నిస్తోంది. దీనిపై కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 403 ((నిజాయితీ లేకుండా ఆస్తి దుర్వినియోగం చేయడం), 465 (ఫోర్జరీకి శిక్ష), 120 (జైలు శిక్షతో కూడిన నేరం చేసేలా డిజైన్‌ను దాచిపెట్టడం), 34 (సాధారణ ఉద్దేశం) సెక్షన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 66, మరియు కాపీరైట్ చట్టం, 1957లోని సెక్షన్ 63 ప్రకారం, సాధారణంగా పార్టీ మరియు ముగ్గురు కాంగ్రెస్ నాయకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications