Bigg Boss 14: గుర్పాల్ గుడ్‌బై: ఎలిమినేషన్ పై అదే రచ్చ... వారు చేసేదానికి ప్రేక్షకులెందుకంటూ చర్చ
ముంబై: ఈ కరోనా సమయంలో చాలామందికి బిగ్‌బాస్ మాంచి టైంపాస్ అవుతోంది. ప్రస్తుతం మూడు భాషల్లో ఈ బిగ్‌బాస్ రియాల్టీ షో నడుస్తోంది. తెలుగులో గత నెల సెప్టెంబర్ 6న ప్రారంభమై ఇప్పటికే ఐదువారాలను పూర్తి చేసుకుంది. హిందీ తమిళంలో ఈ నెలలోనే ప్రారంభమైంది. ఇక బిగ్ బాస్ హిందీ 14వ సీజన్‌కు కండలవీరుడు సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఒక వారం పూర్తయినందున ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరపడుతోంది. అయితే హిందీ బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ కాస్త వెరైటీగా ఉంది.
హిందీలో బిగ్‌బాస్ ప్రారంభమై చాలా బాగా రన్ అవుతోంది. సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ మెగా రియాల్టీ షో తొలివారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేదానిపై స్పష్టత వచ్చేసింది. ఈసారి బిగ్‌బాస్ 14 హిందీ సీజన్‌లో ఎలిమినేట్ అయ్యే తొలి కంటెస్టెంట్ పంజాబీ సింగర్ సారా గుర్‌పాల్ అని సమాచారం. అంతకుముందు బిగ్‌బాస్ సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఉన్న గౌహర్ ఖాన్, హీనా ఖాన్, సిద్ధార్థ్ శుక్లాలు ప్రస్తుత కంటెస్టెంట్ సారా గుర్పాల్‌పై అస్త్రం ఎక్కుపెట్టడంతో దాదాపు ఆమె ఎలిమినేషన్ ఖరారైనట్లు తెలుస్తోంది.

ఇక సారా గుర్పాల్‌కు ఇచ్చిన టాస్కులో ఘోరంగా విఫలమైందని ఆమె ఇంట్లో ఉండేందుకు అనర్హురాలని ఈ బిగ్‌బాస్ సీనియర్ కంటెస్టెంట్లు తేల్చినట్లు సమాచారం. అయితే సారా ఎలిమినేట్ అవుతోందన్న ప్రచారం ఆమె అభిమానులను కలచివేస్తోంది. సారా పై ఎంతగానో ఆశపెట్టుకున్న ఆమె అభిమానులు ఇది నిజం కాకపోతే బాగుండునంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై భిన్న వాదనలు ట్విటర్ వేదికగా పోస్టు చేశారు సారా అభిమానులు. కంటెస్టెంట్‌గా ఉన్న జాన్ సిద్ధార్థ్ శుక్లా అభిమాని కాబట్టే అతని ప్రదర్శన బాగోలేకపోయినా ఎలిమినేట్ చేయకుండా లోపల ఉంచారని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉంటే ఎలిమినేషన్‌కు సంబంధించి సీనియర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిర్ణయమే ఫైనల్ అయితే.. ఇక ఆడియెన్స్‌ను పిచ్చివారిని చేయడం ఎందుకని మరికొందరు ట్వీట్ చేశారు. సారా తన 100శాతం ప్రదర్శన ఇచ్చిందని అయితే ఇతర కంటెస్టెంట్లు పేరుగాంచిన పెద్దవారు కావడంతోనే వారిని హౌజ్‌లో ఉంచారనే అభిప్రాయం మరికొందరు వ్యక్తం చేశారు. నిర్వాహకులు సిగ్గుపడాలని ఘాటుగా ట్వీట్ చేశారు. ఇక బిగ్‌బాస్ 14ను ఫాలో అవుతున్నట్లయితే అందులోని కంటెస్టెంట్లందరూ ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా పవిత్ర మరియు నిక్కీ తంబోలీ మాత్రమే సేఫ్ జోన్‌లో నిలిచారు.
Breaking #BiggBoss_Tak
— #BiggBoss_Tak👁️ (@BiggBoss_Tak) October 11, 2020
Shocking News!!!
As per Sources, #SaraGurpal become 1st contestant to EVICT from BiggBoss Season 14 house. Senior's taken the decision to EVICT her.#BB14WithBiggBoss_Tak












Click it and Unblock the Notifications