Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్: అభ్యర్థి ఆస్తి రూ.928 కోట్లు, ఇద్దరికి సున్నా

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో దఫాలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడైన అభ్యర్థి రూ.928 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాడు. ఆయా అభ్యర్థులు తమ తమ ఆస్తులు అఫిడవిట్‌లలో పొందుపర్చారు. ఆస్తులు లేని వారు కూడా ఉన్నారు.

రమేష్ శర్మ అనే వ్యక్తి స్వతంత్ర అభ్య్రర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇతని వద్ద రూ.9,2853,54,696 కోట్లు ఉన్నాయి. యుగేశ్వర్ మాంఝీ, కుమార్ రాజీవ్ అనే ఇద్దరు అభ్యర్థులకు ఆస్తులేమీ లేవు. వారి అఫిడవిట్లలో ఆదాయంలో సున్నా అని ఉంది. మూడో దఫాలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు చూస్తే రూ.2.40 కోట్లుగా ఉంది.

ఎవరీ అత్యంత ధనవంతుడు?

మూడో ఫేజ్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో రమేష్ శర్మ అత్యంత ధనవంతుడు. ఇతను బిక్రమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇతని ఆస్తులు రూ.928 కోట్లకు పైగా ఉన్నాయి. ఇతని చర ఆస్తులు రూ.23,93,54,696, స్థిర ఆస్తులు రూ.9,04,60,00,000గా ఉన్నాయి.

డాక్టర్ కుమార్ ఇంద్రదేవ్... బార్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇతని వద్ద చర ఆస్తులు రూ.22,48,600 ఉన్నాయి. స్థిర ఆస్తులు రూ.1,1102,00,000గా ఉన్నాయి. ఇతని మొత్తం ఆస్తులు రూ.1,11,24,48,600గా ఉంది.

అఖిలేష్ కుమార్ బిఎస్పీ అభ్యర్థిగా బక్తిపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇతను తన ఆస్తులను.. చర ఆస్తులు రూ.7,56,92,310గా, స్థిర ఆస్తులు రూ.54,27,85,000గా చూపించారు. అతని మొత్తం ఆస్తులూ రూ.61,84,77,310గా ఉన్నాయి.

 Bihar 3rd phase polls: Richest candidate is worth Rs 928 crore, poorest 0

అతి తక్కువ ఆస్తులు కలిగిన వారు

రెండో దఫాలో పోటీ చేస్తున్న 808 మంది అభ్యర్థుల్లో ఇద్దరు అభ్యర్థులు... యుగేశ్వర్ మాఝీ (అస్తవాన్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ), కుమార్ రాజీవ్ (ఫత్వాహ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ)లు తమ అఫిడవిట్లో ఆస్తులను సున్నాగా చూపించారు.

నలంద నుంచి పోటీ చేస్తున్న మన్మోహన్ కుమార్(సిపిఐఎంఎల్ఎల్).. తన చర ఆస్తులను రూ.2000గా, స్థిర ఆస్తులు లేనట్లు చూపించారు. మొత్తం ఆస్తులు రూ.2వేలు.

అరా నుంచి పోటీ చేస్తున్న ఉమేశ్వర్ మిశ్రా (బిజెపి) తన చర ఆస్తులను రూ.2000గా చూపించారు. స్థిర ఆస్తులు లేవని చెప్పారు. బిర్ కౌర్ సింగ్ (అమ్నోర్ స్వతంత్ర అభ్యర్థి) తన ఆస్తులను రూ.5000గా చూపించారు. తన వద్ద స్థిర ఆస్తులు లేవని పేర్కొన్నారు.

పార్టీల వారీగా కోటీశ్వరులు

మూడో దఫాలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో పార్టీ వారీగా కోటీశ్వరులు... బిజెపిలో 34 మంది పోటీ చేస్తుంటే 26 మంది కోటీశ్వరులు. పార్టీలో ఇది 76 శాతం. బిఎస్పీ తరఫున 47 శాతం మంది పోటీ. 13 మంది కోటీశ్వరులు. ఇది పార్టీలో 18 శాతం.

జేడీయూ తరఫున 18శాతం మంది పోటీ. 13 మంది కోటీశ్వరులు. ఇది పార్టీలో 72 శాతం. కాంగ్రెస్ తరఫున 7 శాతం మంది పోటీ. 5 మంది కోటీశ్వరులు. ఇది పార్టీలో 71 శాతం. ఆర్జేడీ తరఫున 25 శాతం మంది పోటీ. 20 మంది కోటీశ్వరులు. ఇది పార్టీలో 80 శాతం. సమాజ్ వాది పార్టీ తరఫున 31 మంది పోటీ. 16 మంది కోటీశ్వరులు. ఇది పార్టీలో 52 శాతం.

పార్టీల వారీగా ఆస్తులు...

34 మంది బిజెపి అభ్యర్థుల ఆస్తుల సగటు 2.06 కోట్లు, 47 మంది బిఎస్పీ అభ్యర్థుల ఆస్తుల సగటు రూ.2.21 కోట్లు, 18 మంది జెడీయూ అభ్యర్థుల ఆస్తుల సగటు 2.43 కోట్లు, ఏడుగురు కాంగ్రెస్ అభ్యర్థుల ఆస్తుల సగటు రూ.5.88 కోట్లు, 25 మంది ఆర్జేడీ అభ్యర్థుల ఆస్తుల సగటు 4.66 కోట్లు. 31 మంది ఎస్పీ అభ్యర్థుల ఆస్తుల సగటు రూ.1.59 కోట్లు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+