Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bihar election result 2025:జగన్ ఫార్ములా..ఆర్జేడీ కొంప మునిగింది ఇందుకే..!!

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే చర్చ. అదే బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. రెండు దశల్లో బీహార్ అసెంబ్లీకి పోలింగ్ జరిగింది. 1951లో తొలిసారి రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగగా ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. ఏకంగా 69శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఈ సారి ఫలితాలు నువ్వా నేనా అన్నట్లుగా ఉంటాయని అంతా అంచనా వేశారు. కానీ రియల్ పిక్చర్ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపించింది. ఎన్డీయే కూటమి కూల్‌గా విజయం వైపు అడుగులు వేస్తోంది. ఇక ఎప్పటి నుంచో సీఎం పీఠం కోసం ఎదురుచూస్తోన్న ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌కు మరో సారి భంగపాటు కలిగింది. మరో ఐదేళ్లు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వస్తోంది. తేజస్వీ లేదా ఆర్జేడీ కూటమి ఓటమిపాలు కావడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.

52 టికెట్లు యాదవ సామాజిక వర్గానికి..
బీహార్‌లో కులరాజకీయమే రాజ్యమేలుతుందనేది ఓపెన్ సీక్రెట్. తేజస్వీ యాదవ్ కూడా కులాల ఈక్వేషన్‌ను నమ్ముకుని టికెట్లు కేటాయించడం జరిగింది.ఇదే ప్రధానంగా దెబ్బతీసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తన సొంత సామాజికవర్గమైన యాదవ సామాజిక వర్గానికి 52 టికెట్లను కేటాయించారు. అయితే ఈ నిర్ణయమే ఆర్జేడీకి నష్టం కలిగించింది. 52 సీట్లు యాదవ్ కులానికి కేటాయించడంతో యాదవేతరులు లేదా నాద్ యాదవ్ కమ్యూనిటీ ఆర్జేడీకి దూరమైందనే చెప్పాలి. జనాభాలో 14శాతం యాదవులు ఆర్జేడీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు.దీంతో ఇతర అగ్ర కులాలు, వెనకబడిన సామాజిక వర్గాలు మహాకూటమికి దూరం అయ్యారు.

bihar-assembly-election-result-2025-five-reasons-for-tejaswis-defeat

ఆర్జేడీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా, అందులో 52 మంది యాదవులు ఉన్నారు. బీజేపీ తమ ఎన్నికల ప్రచారంలో 'RJD యాదవ రాజ్' అనే కథనాన్ని బలంగా వినిపించింది.ఇది పట్టణ,మధ్య తరగతి ఓటర్లలో బాగా ప్రతిధ్వనించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ మాదిరిగా, తేజస్వి కూడా 30-35 స్థానాలు యాదవ సామాజిక వర్గానికి మాత్రమే కేటాయించి ఉండి ఉంటే, కుర్మి-కోయిరి వంటి వర్గాల ఓట్లు పెరిగే అవకాశం ఉండేది.

మిత్రపక్షాలను విస్మరించడం...
ఇదిలా ఉంటే తేజస్వీ యాదవ్ వ్యూహంలో కూడా అతిపెద్ద లోపం కనిపించింది.మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు ఇతర చిన్న పార్టీలను విస్మరించడం.సీట్ల పంపకాల వివాదం కూడా మహాకూటమిని బలహీనపరిచి ఉండొచ్చు.కాంగ్రెస్ 'హామీల' మేనిఫెస్టోపై దృష్టి పెడితే, తేజస్వి కేవలం 'ఉద్యోగాలు' అనేదానికే ప్రాధాన్యత ఇచ్చారు, ఇది మిత్రపక్షాలకు రుచించలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రచారంలోనూ రాహుల్ గాంధీ వంటి మిత్రపక్ష నాయకులకు వెనుక సీటు ఇచ్చి, కేవలం తానే ప్రమోట్ అయ్యేలా తేజస్వీ చొరవ చూపడంతో మైనస్ అయి ఉండొచ్చు.

వాగ్దానాలకు బ్లూప్రింట్ ఇవ్వలేకపోవడం
తేజస్వి అతిపెద్ద హామీ (ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం, పింఛను వంటివి) చేసినా, వాటికి సంబంధించిన ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక (బ్లూప్రింట్‌ను) ఇవ్వలేకపోవడం ఓటర్లలో అపనమ్మకాన్ని సృష్టించింది. నిధులు, అమలు ప్రణాళికపై స్పష్టత లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. 'మరో 2 రోజుల్లో బ్లూప్రింట్ వస్తుంది' అని ప్రతిరోజూ చెబుతూ వచ్చినా, ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ఆ స్పష్టత రాలేదు. దీంతో ఓటర్లలో ఆయన వాగ్దానాలపై విశ్వాసం సన్నగిల్లింది.

మహాకూటమికి ముస్లిం పక్షపాత ముద్ర
మహాకూటమికి ఉన్న 'ముస్లిం-పక్షపాత' ముద్ర కూడా తేజస్వి యాదవ్ ఓటమికి పెద్ద కారణంగా నిలిచింది. ముస్లింలు అధికంగా ఉన్న స్థానాల్లో మహాకూటమికి మద్దతు లభించినా, రాష్ట్రవ్యాప్తంగా ఈ ముద్ర నష్టం చేసింది. బీహార్‌లో అధికారంలోకి వస్తే వక్ఫ్ బిల్లును అమలు చేయబోమని తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన కొందరు యాదవులకు కూడా నచ్చలేదు. బీజేపీ ఈ అంశాన్ని, ముఖ్యంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా లాలూ ప్రసాద్ పార్లమెంటులో ఇచ్చిన పాత ఉపన్యాసాన్ని బాగా వైరల్ చేయడం, ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చింది.

తండ్రి లాలూ ప్రసాద్ వారసత్వంపై గందరగోళ వైఖరి
తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ వారసత్వం ద్వారా సామాజిక న్యాయ ఎజెండాను అందిపుచ్చుకోవాలని ప్రయత్నించినా, 'జంగిల్ రాజ్' (అరాచక పాలన) ముద్రకు భయపడి, ఆయనకు దూరం పాటించారు. పోస్టర్‌లలో లాలూ ఫోటోను చిన్నదిగా చేసి 'కొత్త తరం' నాయకుడిగా చూపించడానికి ప్రయత్నించడం గందరగోళాన్ని సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ గోపాల్‌గంజ్ ర్యాలీలో మాట్లాడుతూ, "తేజస్వి లాలూ పాపాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారు" అని విమర్శించడానికి ఈ వైఖరే అవకాశం ఇచ్చింది.ఈ ద్వంద్వ నీతి చివరకు తేజస్వికి విరుద్ధంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+