• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిరూపించుకోవాల్సిన తరుణం... తేజస్వికి అగ్ని పరీక్ష.. ఈ సీఎం అభ్యర్థి నాయకత్వం ఈసారైనా ఫలిస్తుందా?

|

గత 30 ఏళ్లలో మొదటిసారిగా లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండా ఆర్జేడీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతోంది. పార్టీ బాధ్యతలను చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ తన భుజాలపై వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి తరుపున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. నిజానికి లాలూ జైలుకు వెళ్లినప్పటి నుంచి నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీలో... తేజస్వి నాయకత్వానికి ఇదో అగ్నిపరీక్ష అనే చెప్పాలి. అన్న తేజ్ ప్రతాప్‌ను కాదని,తేజస్వి యాదవ్ పార్టీపై తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. మొదట్లో విబేధించినా... ఆ తర్వాత తమ్ముడి నాయకత్వంలో పనిచేసేందుకు తేజ్ ప్రతాప్ రాజీపడ్డారు.

తేజస్వి పరువు తీసిన నితీశ్... కేబినెట్ మీటింగే సరిగా నిర్వహించలేరు... ఇక ఉద్యోగాలా...?

లోక్‌సభ ఎన్నికల్లో తేజస్వి ఫ్లాప్ షో...

లోక్‌సభ ఎన్నికల్లో తేజస్వి ఫ్లాప్ షో...

గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే మహాకూటమి బరిలో దిగింది. అయితే ఎన్నికల్లో కూటమి ఫ్లాప్ షో తేజస్విని తీవ్రంగా నిరాశపరిచింది. కూటమి భాగస్వామి కాంగ్రెస్ కేవలం ఒక్క ఎంపీ సీటు గెలవగా... పెద్దన్న పాత్ర పోషించిన ఆర్జేడీ 20 సీట్లలో పోటీ చేసి ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానాన్ని గెలవలేకపోయింది. దీంతో తేజస్వి యాదవ్‌పై వ్యతిరేకత వచ్చినప్పటికీ.. అప్పటికీ పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవడం, అతని నాయకత్వంలో అవే మొదటి ఎన్నికలు కావడంతో... పార్టీ నేతలు సర్దుకుపోయారు. అయితే సోదరుడు తేజ్ ప్రతాప్ మాత్రం తేజస్విపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు సంబంధించి తన సలహాలు,సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదని.. పర్యవసానంగా పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని ఆరోపించారు.

నిరూపించుకోవాల్సిన తరుణం...

నిరూపించుకోవాల్సిన తరుణం...

గత లోక్‌సభ ఎన్నికల్లో ఫ్లాప్ షోని అటు జనం,ఇటు పార్టీ నేతలు మరిచిపోయేలా చేయాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి కచ్చితంగా తన మార్క్ చూపించాలి. అప్పుడంటే అంతా లైట్ తీసుకున్నారు కాబట్టి... తేజస్వి నాయకత్వంపై పెద్ద వ్యతిరేకత రాలేదు. కానీ వరుసగా రెండోసారి కూడా అవే ఫలితాలు పునరావృతమైతే తేజస్వి నాయకత్వంపై తీవ్ర విమర్శలు తప్పవు. అదే జరిగితే,సోదరుడు తేజ్ ప్రతాప్ నుంచే తేజస్వి నాయకత్వానికి ప్రమాదం ఏర్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో సత్తా చాటి లాలూకి సరైన రాజకీయ వారసుడిని తానే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత తేజస్విపై ఉన్నది. కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికలు తేజస్వికి పెద్ద అగ్ని పరీక్ష అనే చెప్పాలి.

  India-China Stand Off : లడఖ్ ను భారత్ అక్రమంగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది - China
  అన్న కంటే ఎక్కువ ఆస్తులు...

  అన్న కంటే ఎక్కువ ఆస్తులు...

  అక్టోబర్ 28 నుంచి జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అన్నాదమ్ములు తేజస్వి,తేజ్ ప్రతాప్ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లతో ఇద్దరు ఆస్తుల వివరాలు బయటకు రాగా... అన్న తేజ్ ప్రతాప్ కంటే తమ్ముడు తేజస్వికే ఎక్కువ ఆస్తులు ఉండటం గమనార్హం. తన మొత్తం ఆస్తి రూ.5.88కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్న తేజస్వి... ఇందులో స్థిరాస్తులు రూ.4.73కోట్లు,చరాస్తులు రూ.1.15కోట్లుగా పేర్కొన్నాడు. తేజ్ ప్రతాప్ తన మొత్తం ఆస్తిని రూ.2.82కోట్లుగా పేర్కొన్నాడు. తాజా ఎన్నికల్లో తేజస్వి రఘోపూర్ నుంచి పోటీ చేస్తుండగా.. తేజ్ ప్రాతప్ హసన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. సోదరుడి నాయకత్వానికి పూర్తిగా సహకరిస్తానని తేజ్ ప్రతాప్ ఇదివరకే చెప్పిన నేపథ్యంలో... ఈ ఎన్నికల్లో అన్నాదమ్ములు మహాకూటమిని ఏ స్థితిలో నిలబెడుతారో వేచి చూడాలి.

  English summary
  In poll-bound Bihar, bonhomie abounds between the two siblings -- Tej Pratap Yadav and Tejashwi Prasad Yadav — of the main opposition party in the state, Rashtriya Janata Dal (RJD), but the younger one is a cut above on all counts.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X