వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: నేర చరితులకే పెద్ద పీట, భార్యలు, వారసులకు టికెట్లు, ఆర్జేడీనే ముందు

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలంటే ఇప్పటి వరకు ఎక్కువగా తుపాకులు, గుండాలు, వారసత్వ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. నేర-రాజకీయాల నెక్సస్, వంశ రాజకీయాలు ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఆందోళన కలిగించే అంశాలుగా మారాయి. దాదాపు ప్రతి పార్టీ రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ, నేరస్థులు-రాజకీయ నాయకుల భార్యలు, కుమారులు, కుమార్తెలను ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యాయి.

వారి వారసులకు పెద్ద పీట..

వారి వారసులకు పెద్ద పీట..

ఇప్పుడు కూడా స్థానికంగా బాహుబలులుగా పిలవబడేవారు, కండబలంగలవారు అసెంబ్లీ ఎన్నికలపై తమ ప్రభావాన్ని చూపేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మరో 40 మంది అభ్యర్థులకు సంకేతాలిచ్చింది ఆర్జేడీ. రాజకీయ నాయకులుగా మారిన స్థానిక బాహుబలులు.. ప్రత్యక్షంగా లేదా వారి జీవిత భాగస్వాములు, బంధువుల ద్వారా ప్రధాన రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాగా, వారిలో కొందరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పోటీ చేయకపోవచ్చు లేదా ఉండకపోవచ్చు, కాని వారి 'దీవెనలు' అభ్యర్థుల అదృష్టాన్ని ప్రభావితం చేయగలవు. పోటీలో వారి జీవిత భాగస్వాములు., వార్డుల ఉనికిని చాటుతాయని తెలుస్తోంది.

ఆర్జేడీ నుంచే ఎక్కువ నేరచరితులు

ఆర్జేడీ నుంచే ఎక్కువ నేరచరితులు

ఎన్నికలను క్లీన్‌గా నిర్వహించాలని ఎన్నికల సంఘం ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. డబ్బులు, మందబలాన్ని పూర్తిగా కట్టడిచేయలేకపోతోంది.
ఎన్నికలలో గెలవడం చాలా కీలకం కాబట్టి, రాజకీయ పార్టీలు ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నాయి. ఆర్జేడీ నుంచే ఎక్కువగా నేరచరిత కలిగిన అభ్యర్థులు ఉండటం గమనార్హం. వీరిలో హత్యలు, కిడ్నాపులు, దోపిడీలకు పాల్పడిన వారున్నారు. కాగా, జేడీయూ మాత్రం అలాంటి వారికి టికెట్ ఇవ్వడం లేదు.

ఆర్జేడీలో నేరచరితులకు పెద్దపీట.. వారికే టికెట్లు

ఆర్జేడీలో నేరచరితులకు పెద్దపీట.. వారికే టికెట్లు

నవడా అసెంబ్లీ స్థానం నుంచి వైభా దేవి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఈమే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ వల్లభ్ యాదవ్ భార్య కావడం గమనార్హం. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఈమే ఓటమిపాలయ్యారు. రేప్, మర్డర్ కేసుల నేపథ్యంలో రాజ్ వల్లభ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఇతనిపై మరో 17 కేసులు కూడా ఉన్నాయి.
భోజ్‌పూర్ జిల్లాలోని సందేశ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా కిరణ్ దేవి పోటీ చేస్తున్నారు. ఈమే ఓ మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ కుమార్ యాదవ్ భార్య. అతడు రెండేళ్లుగా పరారీలో ఉన్నాడు. కోర్టు ఆదేశాల మేరకు అతని ఆస్తులను అటాచ్ చేశారు. గయ జిల్లాలోని ఆత్రి అసెంబ్లీ స్థానం నుంచి ఆర్జేడీ మనోరమ దేవి పోటీ చేస్తున్నారు. ఓ యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న బింది యాదవ్ భార్యే ఈ మనోరమ దేవి.

ఎన్నికల బరిలో బాహుబలుల వారసులు

ఎన్నికల బరిలో బాహుబలుల వారసులు


వైశాలి జిల్లాలోని మహ్నర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ రమా సింగ్‌ భార్యను ఆర్జేడీ కోరుతోంది. అయితే, రమా సింగ్‌పై కిడ్నాప్, హత్య కేసులున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజస్వి ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ.. పలువురు నేతల కుమారులు, కుమార్తెలను కూడా బరిలోకి దింపుతోంది. మాజీ మంత్రి, ఆర్జేడీ రాష్ట్ర నేత జగదానంద్ సింగ్ కుమారుడు సుధాకర్ సింగ్‌ను రాంగఢ్ నుంచి పోటీ చేయాలని కోరుతోంది ఆర్జేడీ. షాపూర్ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత శివానంద్ తివారీ కుమారుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే రాహుల్ తివారీని బరిలోకి దింపుతోంది. మాజీ కేంద్రమంత్రి కాంతి సింగ్ కుమారుడు రిషీ సింగ్ ఒబ్రా నుంచి పోటీ చేయనున్నారు. మాజీ కేంద్రమంత్రి జయప్రకాశ్ నారాయణ్ యాదవ్ కూతురు దివ్య కీర్తి తారాపూర్ నుంచి బరిలో ఉన్నారు. జయప్రకాశ్ తమ్ముడు విజయ్ ప్రకాశ్ మరోసారి తన స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

హత్య, కిడ్నాప్, దోపిడీ లాంటి కేసులున్నా..

హత్య, కిడ్నాప్, దోపిడీ లాంటి కేసులున్నా..

దర్భంగ రూరల్ నుంచి లలిత్ కుమార్ యాదవ్, పతువా నుంచి రామానంద్ యాదవ్, జెహనాబాద్ నుంచి సురేంద్ర ప్రసాద్ యాదవ్ లాంటి నేర చరితులను కూడా ఆర్జేడీ బరిలో దింపుతోంది. మగద్ సామ్రాట్ అని పిలువబడే సురేంద్ర యాదవ్.. గయ, ఔరంగబాబాద్, జెహనాబాద్, నవడా, అర్వాల్ జిల్లాల్లో ప్రభావం చూపే నేతగా ఉన్నారు. దనపూర్ గ్యాంగ్‌స్టర్ రిట్లాల్ యాదవ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్తిగా ఎన్నికయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కూతురుకు మద్దతివ్వాలని కోరుతూ గతంలో లాలూ ప్రసాద్ యాదవ్.. రిట్లాల్ ఇంటికి వెళ్లడం గమనార్హం. ఇంకా ఆర్జేడీ నుంచి పోటీ చేస్తున్న రాజేష్ కుమార్ రౌషన్ అలియాస్ బబ్లూ యాదవ్, మనోరంజన్ సింగ్ లపై హత్య, కిడ్నాప్, దోపిడీ కేసులుండటం గమనార్హం. జైలు శిక్ష అనుభవించిన బాహుబలి, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ భార్య లవ్లీ ఆనంద్ కూడా ఆర్జేడీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గోపాల్ గంజ్ డీఎం హత్య కేసులు ఆనంద్ మోహన్ నిందితుడిగా ఉన్నారు.

బీజేపీ నుంచి కొందరు..

బీజేపీ నుంచి కొందరు..

నరేంద్ర కుమార్ సింగ్, లేషి సింగ్, పూనమ్ దేవి, నీరజ్ సింగ్, అనిల్ సింగ్ లాంటి నేతలు బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీరిపై కూడా సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి. జేడీయూ కూడా బాహుబలులను బరిలో దింపుతోంది. నేతల వారసులకు కూడా టికెట్లు ఇస్తోంది. సుప్రీంకోర్టు నేరచరితులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వద్దని సూచించినప్పటికీ.. అలాంటి వారు తమ భార్యలు, కూతుర్లు, కుమారులను బరిలో దింపుతున్నారు. కాగా, ప్రధాన పార్టీలు తీవ్ర నేరచరితులకు టికెట్లు ఇవ్వడం లేదు.

English summary
Guns and goons have played a key role in Bihar elections, and so has dynastic politics. The crime-politics nexus and dynastic politics has become an increasingly worrying phenomenon in recent times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X