వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

NEWSX DV RESEARCH bihar exit polls: ఎన్డీఏపై ఆర్జేడీదే పైచేయి! లెక్క ఇలా

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ తుది దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికే పట్టాయి. కొన్ని సంస్థలు మాత్రమే ఎన్డీఏ కూటమికి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.

ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుతం సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ బరిలో ఉండగా, మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ పోటీలో ఉన్నారు. బీహార్ రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో మహాకూటమికే పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే, హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని మరికొన్ని పేర్కొంటున్నాయి. నవంరబ్ 10 అసలైన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

 Bihar assembly Exit Polls 2020: Edge to RJD-led alliance, NewsX-DV Research.

న్యూస్ఎక్స్ డీవీ రీసెర్చ్ ఎగ్జిపోల్ హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని చెబుతోంది.

న్యూస్ఎక్స్ డీవీ రీసెర్చ్ ఎగ్జిపోల్ సర్వే ప్రకారం..

ఎన్డీఏ: 110-117
మహాకూటమి: 108-123
ఎల్జేపీ: 4-10
ఇతరులు: 8-23

ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోలింగ్

నితీష్ కుమార్(బీజేపీ-జేడీయూ+) - 104-128
తేజశ్వి యాదవ్ )ఆర్జేడీ-కాంగ్రెస్+) - 108- 131
ఎల్జేపీ(చిరాగ్ పాశ్వాన్) - 1-3
ఇతరులు: 4-8

243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ రాష్ట్రంలో 122 మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు రావాలి. కాగా, బీహార్ రాష్ట్రంలో 15ఏళ్లకుపైగా కొనసాగుతున్న నితీష్ కుమార్ ప్రభుత్వంపై ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలోని యువత, మహిళలు కూడా తేజశ్వి యాదవ్ నాయకత్వానికే మొగ్గుచూపడటం గమనార్హం.

English summary
Bihar assembly Exit Polls 2020: Edge to RJD-led alliance, NewsX-DV Research.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X