బీహార్ కొనసాగుతున్న రెండోదశ పోలింగ్- ఓటేసిన నితీశ్, తేజస్వీ- ఓటర్లు రావాలని పిలుపు...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ చురుగ్గా సాగుతోంది. 17 జిల్లాల్లోని 94 స్ధానాల్లో జరుగుతున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సీఎం నితీశ్ కుమార్, మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్, ఆయన తల్లి, మాజీ సీఎం రబ్రీదేవితో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Recommended Video
దిఘాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఓటు వేశారు. పాట్నాలో మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ, ఆయన తల్లి రబ్రీదేవి ఓటేశారు. కరోనా జాగ్రత్తలు తీసుకుని అందరూ ఓటు వేయాలని తేజస్వీ కోరారు. బీహార్లో మార్పు పవనాలు వీస్తున్నాయని, ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని ఓటేసిన తర్వాత తేజస్వీ వ్యాఖ్యానించారు.

జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు, సీపీఐ నేత కన్హయ్య కుమార్ బెగూసరాయ్‌లో ఓటేశారు. ప్రజాస్వామ్య పండుగలో పాలుపంచుకోవాలని ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఓటర్లను భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
కరోనా నేపథ్యంలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకే ముగియాల్సి ఉండగా.. ఆరు గంటల వరకూ అవకాశం ఇచ్చారు. కరోనా రోగుల కోసం చివరి గంట కేటాయించారు. 8 సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఓటేసేందుకు వచ్చే 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, రోగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణా సదుపాయం కల్పించింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications