Bihar Election 2025: మరికొన్ని గంటల్లో తొలివిడత పోలింగ్..
బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ బిహార్ లోని 243 స్థానాలకుగాను తొలి దశలో భాగంగా 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. ఉదయం7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఆ సమయంలో క్యూ లైనులో ఉన్న ఓటర్లను మాత్రమే అనుమతిస్తారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.
బిహార్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. నవంబర్ 6 , గురువారం రోజున పోలింగ్ జరగనుంది. తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఇక రెండో దశ పోలింగ్ నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

తొలి విడత పోలింగ్ కోసం 45, 341 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 36,733 పోలింగ్ బూత్స్ ఉండగా పట్టణ ప్రాంతాల్లో 8,608 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియను ఎలాంటి అవరోధాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఎలక్షన్ అధికారులను ట్రైనింగ్ ఇచ్చారు. ఇక మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే చూస్తోంది. అలాగే సీఎం పీఠం కోసం RJD నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ తీవ్రంగా శ్రమిస్తోంది. అటు జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్.. తొలిసారి బిహార్ ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఈ సారి పోటీ రసవత్తరంగా మారబోతోంది.












Click it and Unblock the Notifications