బిహార్ లో తొలిదశ పోలింగ్ పూర్తి.. 64.46 శాతం పోలింగ్ నమోదు

బిహార్ లో తొలిదశ పోలింగ్ పూర్తయింది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు బిహార్ లో 64.46 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అత్యధికంగా బెగుసరాయ్ నియోజకవర్గంలో 67.32 శాతం పోలింగ్ నమోదైంది. బిహార్ లో అగ్రనాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వీరిలో సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ, ఆర్జేడీ పార్టీ లాలూ యాదవ్, తేజస్వి యాదవ్, ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్.. తదితరులు ఉన్నారు. సీఎం నితీశ్ కుమార్ భక్తియార్‌ పూర్‌ లో ఓటువేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అయితే సేఫ్టీ దృష్ట్యా 5 నియోజకవర్గాల్లో 5 గంటలకే పోలింగ్ పూర్తయింది.

అయితే బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. లఖిసరాయ్‌ లో ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తున్న ఆయన కాన్వాయ్ పై కొందరు ప్రతిపక్షనేతలు రాళ్లు రువ్వారు. చెప్పులు, ఆవు పేడ విసిరారు. అంతటితో ఆగకుండా ఓ పోలింగ్ బూత్‌ ను సైతం స్వాధీనం చేసుకునేందుకు ఆర్జేడీ కార్యకర్తలు ప్రయత్నించారని డిప్యూటీ సీఎం సిన్హా ఆరోపించారు. ఇక్కడ పేద, దళిత వర్గాల ప్రజలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డపడుతున్నారని.. వెంటనే బలగాలను పంపించాలని స్థానిక ఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు. RJD అధికారంలోకి వస్తే పరిస్థితులు మరింత అధ్వానంగా మారుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bihar Ballot Blitz First Phase Wraps with Impressive 60 13 Turnout Triumph

ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఘటనలను ఏమాత్రం అనుమతించబోమని CEC జ్ఞానేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఇక ఇవాళ జరిగిన పోలింగ్ లో రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ అలాగే ఆయన సోదరుడు జనశక్తి జనతాదళ్ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా.. తదితరులు ఉన్నారు. ఇక బిహార్ లో రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఫలితాలు నవంబర్ 14 న వెల్లడి కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+