వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో బీజేపీకి షాక్: మొకామ ఉపఎన్నికలో ఆర్జేడీ అభ్యర్థి నీలిమా దేవి గెలుపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బీహార్‌లోని మొకామాలో భారతీయ జనతా పార్టీకి చెందిన సోనమ్ దేవిపై రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి నీలం దేవి 16,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. గోపాల్‌గంజ్ ఉప ఎన్నికల ఫలితాలు రావాల్సి ఉంది.

నీలం దేవికి 73,893 ఓట్లు రాగా, సోనమ్ దేవికి 57,141 ఓట్లు వచ్చాయి. బీహార్‌లో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), బహుజన్ సమాజ్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బీజేపీతో జేడీయూ విడిపోయిన తర్వాత మూడు నెలల కిందటే ఏర్పడిన నితీష్ కుమార్ నేతృత్వంలోని 'మహాగత్బంధన్' ప్రభుత్వానికి బీహార్ తొలి ఎన్నికల పరీక్షను ఎదుర్కొంది.

బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్ స్థానాలు గతంలో వరుసగా ఆర్జేడీ-బీజేపీ చేతిలో ఉన్నాయి. ఆ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరిగాయి.

Bihar By-Election Results: RJDs Neelam Devi Defeats BJPs Sonam Devi On Mokama Seat

మొకామా నియోజక వర్గం నుంచి బీజేపీ మొదటిసారి పోటీ చేసింది. ఎందుకంటే కాషాయ పార్టీ గత సందర్భాలలో ఆ స్థానాన్ని తన మిత్రపక్షాలకు వదిలిపెట్టింది. ఉప ఎన్నికల్లో బీజేపీ, ఆర్జేడీలు స్థానిక నేతల భార్యలను రంగంలోకి దించాయి. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవిపై పోటీ చేశారు. ఆమె భర్త అనంత్ సింగ్ అనర్హత వేటుతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

మొకామా 2005 నుంచి అనంత్ సింగ్‌కు బలమైన కోటగా ఉంది. అతను జేడీయూ టిక్కెట్‌పై రెండుసార్లు గెలిచారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

గోపాల్‌గంజ్‌లో మరణించిన పార్టీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ భార్య కుసుమ్ దేవిని బీజేపీ పోటీకి దింపింది. ఆర్జేడీ మోహన్ గుప్తాను నిలబెట్టగా, లాలూ యాదవ్ బావ సాధు యాదవ్ భార్య ఇందిరా యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

English summary
Bihar By-Election Results: RJD's Neelam Devi Defeats BJP's Sonam Devi On Mokama Seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X