వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌ని కలిసిన నితీశ్... మాంఝీపై ఆగ్రహం, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీహార్ సీఎం జితన్ రామ్ మాంఝీపై జెడీయు శాసనసభాపక్ష నేత నితీశ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ త్రిపాఠిని కలిసిన అనంతరం నితీశ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలిపానని చెప్పారు.

అసెంబ్లీలో తనకు మెజార్టీ ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశానని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై కొన్ని రోజులు వేచి చూస్తామన్నారు. అప్పుడు కూడా ప్రభుత్వ ఏర్పాటుపై స్పందన లేకపోతే తమ బలాన్ని ఢిల్లీలో రాష్ట్రపతి ఎదుట ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు.

Bihar crisis: Manjhi will support Nitish if he is made Deputy CM, says JD(U)

ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే బీజేపీ స్పష్టం చేయాలన్నారు. బడ్జెట్ సమావేశాల కంటే ముందే ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో నితీశ్ కుమార్‌తో పాటు శరద్‌యాదవ్, లాలూ ప్రసాద్‌యాదవ్ ఉన్నారు. గవర్నర్‌తో చర్చలు సంతృప్తికరంగా జరిగాయని, నితీశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.

బీహార్ సీఎం మాంఝీ బహిష్కరణ

బీహార్ సీఎం జితిన్ రామ్ మాంఝీ ఎట్టకేలకు ఒక మెట్టు దిగొచ్చినా... జేడీయు పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించింది. జేడీ(యూ)పై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో మాంఝీ మద్దతుదారులు ఉన్నారు. బీహార్ సీఎం జితన రామ్ మాంఝీ ఎట్టకేలకు ఒక మెట్టు దిగారు. సీఎం పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే విశ్వాస పరీక్షలో తన బలమేంటో నిరూపిస్తానని ఆదివారం అర్ధరాత్రి దాగా బెట్టు చేసిన ఆయన సోమవారం ఉదయానికి ఓ మెట్టు దిగారు.

నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి చేపడితే తనకెలాంటి ఇబ్బంది లేదని, అయితే డిప్యూటీ సీఎం పదవి మాత్రం తనకే ఇవ్వాలని ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారని జెడీయు నేతలకు చెప్పినట్లు సమాచారం. జేడీ(యూ)శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నితీశ్‌కుమార్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తూ సోమవారం గవర్నర్‌నను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని సోమవారం కోరే సమయంలో, మాటమార్చారు.

ఇక నితీశ్‌కుమార్‌ను జేడీయూ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నితీశ్‌కు మద్దతుగా శనివారం 20మంది మంత్రులు ఇచ్చిన రాజీనామా లేఖలను గవర్నర్‌ ఆమోదించారు. అయితే సోమవారం తాజాగా మాంఝీ జేడీయు నేతలకు తన ప్రతిపాదనను తెలియజేయడంతో బీహార్‌లో రాజకీయం సంక్షోభం ముగినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.

English summary
According to reports, JD(U) leader Ramai Ram said that Jitan Ram Manjhi will support Nitish Kumar if he is made the Deputy Chief Minister of Bihar. Manjhi, along with Nitish Kumar, will meet the Governor later today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X