బీహార్ లో ప్రశాంత్ కిషోర్ అనూహ్య ఎత్తుగడ..! కింగ్ మేకర్ అవుతారా ?
బీహార్ అసెంబ్లీకి వచ్చే నెలలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, ఆర్జేడీ నేతృత్వంలోని ఇండియా కూటమికీ మధ్యనే ఉందన్న వార్తల మధ్య జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా పావులు కదుపుతున్నారు.
రాజకీయ వ్యూహకర్త కూడా అయిన ప్రశాంత్ కిషోర్ ముందు నుంచీ ఎన్డీయే, ఇండియా కూటములకు దూరంగా ఉంటాననే చెప్తున్నారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే గతంలో ఎన్డీయే కూటమిలో ఉండి తాజాగా దూరమైన లోక్ జన్ శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ కు దగ్గరయ్యారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని జన్ సురాజ్ పార్టీ , చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన శక్తి పార్టీలు పొత్తు కోసం చర్చలు జరుపుతున్నాయి.

వచ్చే నెలలో జరిగే బీహార్ ఎన్నికలకు చిరాగ్ పాశ్వాన్-ప్రశాంత్ కిషోర్ మధ్య పొత్తును తోసిపుచ్చలేమని లోక్ జనశక్తి పార్టీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. రాజకీయాల్లో ఎల్లప్పుడూ తలుపులు తెరిచి ఉంటాయని లోక్ జనశక్తి పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న పాశ్వాన్ , ప్రశాంత్ కిషోర్ ల మధ్య కొంతకాలంగా సీట్ల పంపకాలు జరుగుతున్నట్లు తెలిపాయి.
దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బీహార్ లోని షహాబాద్ ప్రాంతం నుండి పోటీ చేయాలని భావిస్తున్న పాశ్వాన్ .. అసెంబ్లీలో ఉన్న 243 అసెంబ్లీ సీట్లలో 40 సీట్లు కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన ఐదు సీట్లూ గెలిచిన పాశ్వాన్ పార్టీ.. ఇప్పుడు 40 సీట్లలో పోటీకి సిద్దమవుతోంది. మిగతా సీట్లలో ఎన్ని పోటీ చేయాలన్న దానిపై ప్రశాంత్ కిషోర్ చర్చిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూటమి కట్టినా తమకు వచ్చిన ముప్పేమీ లేదని బీజేపీ చెబుతోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications