Bihar elections..నవంబర్ 10 తర్వాత నితీష్ కుమార్ బీహార్ సీఎం అయ్యే ఛాన్స్ లేదు:చిరాగ్ పాశ్వాన్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై నిప్పులు చెరుగుతున్నారు లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ . ముంగేర్ లో దుర్గామాత భక్తులపై పోలీసుల కాల్పుల సంఘటనపై నితీష్ కుమార్ నోరు మెదపడం లేదంటూ నిలదీసిన చిరాగ్ పాశ్వాన్ నేడు మరోమారు ఆయనపై విమర్శల బాణాలు సంధించారు .నవంబర్ 10 తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్లీ సిఎం అవ్వరని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ గట్టిగా చెప్పారు.
Recommended Video

బీహార్ మొదటిది, బిహారీ మొదటి ప్రాధాన్యత అన్న చిరాగ్
నవంబర్ 10 తర్వాత నితీష్ కుమార్ మళ్లీ సిఎం అవ్వరని మీరు వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వమని మీరు నన్ను అడగవచ్చు . అయితే ఇందులో తనకు ఎలాంటి పాత్ర లేదని, ఎవరు పాలించినా సరే నాకు ‘బీహార్ మొదటిది, బిహారీ మొదటి ప్రాధాన్యత కావాలి. నాలుగు లక్షల బిహారీల ఆకాంక్షల మేరకు తయారుచేసిన విజన్ డాక్యుమెంట్ ప్రకారం పని చేయాలని కోరుకుంటున్నాను "అని చిరాగ్ చెప్పారు. అహంకారం కారణంగా గతంలోనూ ప్రజలు బడా నాయకులను గద్దె దింపారు. వారిని అధికారం నుండి తొలగించారు. ముఖ్యమంత్రికి ఇప్పటివరకు బిహార్ అభివృద్ధికి సంబంధించిన రోడ్‌మ్యాప్ లేదు అంటూ విరుచుకుపడ్డారు .

ముంగేర్ ఘటనతో ప్రచారంలో జోరుగా వాగ్బాణాలు
నితీష్ పెద్ద అవినీతి పరుడు అంటూ ,ఇప్పుడిప్పుడే అతని అసలు రంగు బయటపడుతుంది అంటూ నిప్పులు చెరిగిన చిరాగ్ పాశ్వాన్ నితీష్ పెద్ద పల్టూరాం అంటూ విమర్శించారు .సిఎం గత 15 సంవత్సరాలుగా ‘సుశాసన్ బాబు' ట్యాగ్ ధరించి డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చిరాగ్ పాశ్వాన్ నవంబర్ 10 తర్వాత అది సాధ్యం కాదన్నారు .
హోరాహోరీగా జరుగుతున్న బీహార్ పోరులో నేతల మాటల తూటాలు జోరుగా పేలుతున్నాయి. ఇక ముంగేర్ ఘటనతో నితీష్ ను ఇరుకున పెట్టేలా టార్గెట్ చేస్తున్నారు ప్రధాన ప్రత్యర్థులు . ఇది ఇలా ఉంటే మహాగట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి మరియు రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు తేజశ్వి యాదవ్ ఈ సారి విజయకేతనం ఎగరేస్తామని ధీమాతో ఉన్నారు.

కొనసాగుతున్న పోలింగ్ ... కోవిడ్ ప్రభావిత ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు
ప్రజలలో మార్పు సునామిలా ఉందని , బీహార్ ప్రజలు విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్ధిక అభివృద్ధి మొదలైన ఎజెండాపై ఓటు వేస్తారని చెప్పారు. అది తమతోనే సాధ్యం అని గట్టిగా ప్రచారం సాగిస్తున్నారు . మొదటి దశ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28 న జరిగాయి, రెండో దశ ఎన్నికలు ఈ రోజున కొనసాగుతున్నాయి . నవంబర్ 7 న తుది దశ పోలింగ్ కొనసాగనుంది . ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది. కోవిడ్ ప్రభావిత ప్రాంతాలలో కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం తగిన చర్యలు చేపట్టారు .
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications