bihar exit polls 2025: బీహార్ వారిదే-భారీ మెజార్టీతో గెలుస్తారన్న పీపుల్స్ పల్స్..!

బీహార్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికలు ఇవాళ ముగిశాయి. రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లోనూ ఈసారి భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. వీటి ఫలితాలను ఇవాళ రెండో దశ పోలింగ్ ముగిశాక విడుదల చేసింది. ఇందులో బీహార్ లో అధికార ఎన్డీయే మరోసారి అధికారం నిలబెట్టుకుంటుందని తేలిపోయింది.

మొత్తం 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో విజయం కోసం 122 సీట్ల మెజార్టీ అవసరం. అయితే ఈసారి రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 133 నుంచి 159 సీట్లు కట్టబెడతారని తేలినట్లు పీపుల్స్ పల్స్ ప్రకటించింది. విపక్ష మహాకూటమి కేవలం 75 నుంచి 101 సీట్లు మాత్రమే సాధించి విజయానికి దూరంగా నిలిచిపోతోందని తెలిపింది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీకి 0-5 సీట్లు లభించే అవకాశం ఉందని పేర్కొంది. ఇతరులకు 2 నుంచి 8 సీట్లు దక్కనున్నాయి.

bihar exit polls 2025 peoples pulse predicts NDA s big win with 133-159 seats

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఈసారి 46.2 శాతం ఓట్లు సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అలాగే మహాకూటమికి 37.9 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది. జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం ఓట్లు లభిస్తున్నట్లు పేర్కొంది. ఇతరులకు మరో 6.2 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఇందులో 3 శాతం ఓట్లు అటూ ఇటూ అయ్యే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ తెలిపింది. దీంతో బీహార్ లో ఎన్డీయే విజయం ఖాయమని తేలిపోయింది. మహాకూటమి ఎంత గట్టి పోటీ ఇచ్చినా ఓటర్లు మాత్రం ఎన్డీయేనే ఆదరించినట్లు తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+