తరుచూ కూతురింటికి..: అల్లుడితో లేచిపోయిన అత్త
పాట్నా: బీహార్ రాష్ట్రంలో ముక్కున వేలేసుకునే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ అల్లుడు ఏకంగా తన అత్తను లేవదీసుకొని వెళ్లిపోయాడు. అదీ తన భార్యను వదిలేసి, ఆమెతో పాటు వెళ్లిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా చర్చకు దారి తీసింది.
22 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తికి 19 ఏళ్ల లలితతో పెళ్లయింది. లలిత తల్లి ఆశా దేవీ వయస్సు 42. సూరజ్, లలితలు పెళ్లి అనంతరం కాపురం పెట్టారు. ఆశాదేవి అప్పుడప్పుడు తన కూతురు ఇంటికి వచ్చేది. ఆ సమయంలో అత్త ఆశాదేవి, అల్లుడు సూరజ్‌ల మధ్య ప్రేమ వికసించింది.

అత్త ఆశాదేవి తరుచూ కూతురు ఇంటికి వస్తుండేది. దీంతో అత్తా, అల్లుడి మధ్య ప్రేమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. సూరజ్‌కు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆశాదేవి పలుమార్లు వచ్చింది. ఆ తర్వాత అత్తా అల్లుడు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications