Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నితీష్‌కు షాక్: మంత్రి రాజీనామా, ఎస్పీ నుంచి పోటీ

పాట్నా: తనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి రాంధనిసింగ్ బుధవారం మంత్రి పదవికి, జెడియూ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఇది మరో షాక్. ఇప్పటికే మహాకూటమి పలు షాక్‌లు ఎదుర్కొంటోంది.

జెడియూకు రాజీనామా చేసిన అనంతరం రాంధనిసింగ్ మాట్లాడుతూ... తనకు అచ్చొచ్చిన రోహతాస్ జిల్లా కర్ ఘర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాది పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నానని చెప్పారు. లౌకిక మహా కూటమి డబ్బులకు టిక్కెట్లు అమ్ముకుంటోందని ఆరోపించారు.

బీహార్ ఎన్నికల బరిలో లాలూ వారసులు..

Bihar minister Ramdhani Singh resigns over denial of ticket; to contest on SP ticket

బీహార్ ఎన్నికల బరిలో మహాకూటమి తరఫున పలువురు వారసులు బరిలోకి దిగుతున్నారు. ఆర్జేడీ జీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు తేజస్వి యాదవ్ మహూవా నుంచి, తేజ్ ప్రతాప్ యాదవ్ రాఘవపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు.

కాగా నితీష్ కుమార్‌కు మద్దతుగా ఉన్న కుర్మి, కుష్వహా కులాల వారికి జెడీయూ తరఫున, లాలూకు గట్టి మద్దతు పలుకే యాదవులకు, ముస్లీంలకు ఆర్జేడీ తరఫున టిక్కెట్లు కేటాయించారు. కాంగ్రెస్ తరఫున ఓసీలకు ఎక్కవగా అవకాశమిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+