సహకరించలేదని ప్రైవేట్‌పార్ట్స్‌ల్లో ఐరన్‌రాడ్: చికిత్స పొందుతూ మహిళ మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: బీహర్ రాష్ట్రంలో మహిళలపై రెండు దారుణ ఘటనలు చోటుచేసుకొన్నాయి. అత్యాచారానికి సహకరించలేదని ఓ మహిళపై నిందితుడు దారుణంగా ప్రవర్తించాడు.బాధితురాలి ప్రైవేట్ అవయవాల్లో ఐరన్‌రాడ్ చొప్పించాడు. చికిత్స పొందుతూ బాధితురాలు చనిపోయింది. మరో ఘటనలో అత్యాచారానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది.

బీహర్ రాజధాని పట్నాకు కాస్త దూరంలో ఉన్న నౌబట్‌పూర్‌ గ్రామంలో ఈ 'నిర్భయ' తరహా ఉదంతం వెలుగు చూసింది. ధీరజ్‌ పాశ్వాన్‌ అనే 22 ఏళ్ల యువకుడు.. అదే గ్రామానికి చెందిన మహిళ(35)తో కొంత కాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆమెపై తన స్నేహితుడి సాయంతో ధీరజ్‌ అత్యాచారానికి యత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించింది.

దీంతో నిందితుడు ఆమెను కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె జననేంద్రియాల్లోకి ఇనుపరాడ్లను చొప్పించి హింసించాడు. ఆమె పరిస్థితి విషమించటంతో పట్నా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు కాసేపటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు ఉద్యమానికి సిద్ధం కాగా, కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) ను ఏర్పాటు చేసినట్లు ఏడీజీ ఎస్‌ కే సింగల్‌ తెలిపారు.

Bihar: Woman Dies As Man Inserts Iron Rod Into Her Private Parts After Failed Rape Attempt

ఇప్పటికే ప్రధాన నిందితుడు ధీరజ్‌ను అదుపులోకి తీసుకున్నామని.. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. కాగా, నలుగురు పిల్లల తల్లి అయిన ఆమె.. ఆ యువకుడితో గతంలో సన్నిహితంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

బాధితురాలి ఆత్మహత్య

తనపై అత్యాచారం జరిగిందనే అవమాన భారంతో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భగల్‌పూర్‌లో చోటు చేసుకుంది. మంగళవారం స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయమై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ మరుసటి రోజే ఇంట్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించింది

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 35-year-old in Bihar was allegedly brutally killed for protesting against being allegedly raped by two men on Thursday night. One of the men, 22-year-old, inserted an iron rod into her private parts following a failed attempt to rape her. The horrific incident took place in Patna’s Naubatpur.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి