వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో టాయిలెట్ లేదంటూ పుట్టింటికెళ్లిన మహిళ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీహార్‌లోని పాట్నా జిల్లాలో ఓ ఆస్తికర ఉదంతం జరిగింది. టాయిలెట్ కడితేనే కాపురానికి వస్తానంటూ ఓ యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. పాట్నాజిల్లాలోని బిక్రమ్ గ్రామానికి చెందిన కార్పెంటర్ రాకేశ్ శర్మతో బబ్లీదేవి (20)కి గత ఏడాది వివాహం జరిగింది.

తాను నివాసం ఉంటున్న ఇంటి వద్ద టాయిలెట్ కట్టించాలంటూ కాపురానికి వచ్చినప్పుడు ఆమె కోరగా అందుకు అంగీకరించాడు రాకేశ్. ఆ తర్వాత రోజుల్లో ఆ సంగతి మరచిపోయాడు. చివరకి టాయిలెట్ నిర్మాణం మరిచిపోవడంతో పాటు అడిగినందుకు తన భార్యను కొట్టాడు.

Bihar Woman Leaves Husband's House for Lack of Toilet

దీంతో విసిగిపోయిన బబ్లీ దేని తన తల్లిదండ్రులను ఆశ్రయించింది. అంతేకాకుండా తన భర్తను టాయిలెట్‌ని కట్టించేలా చూడాలని కోరుతూ పాట్నా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కూతురి డిమాండ్ సరైందే నంటూ ఆమెకు తల్లి దండ్రులు పుల్ సపోర్ట్ ఇచ్చారు.

టాయిలెట్ కట్టేదాకా ఆ ఇంటికి వచ్చేదిలేదంటూ స్పష్టం చేసింది. ప్రతి ఇంటికి టాయిలెట్ తప్పనిసరి అని తేల్చిచెప్పింది. "బహిరంగ ప్రదేశాల్లో బహిర్భూమికి వెళ్లడం మహిళకు సిగ్గుచేటు. ఇది ఆరోగ్యం, గౌరవం హుందాతనానికి సంబంధించిన విషయం" అని ఆమె చెప్పింది.

English summary
A woman in a Bihar village has left her husband's house after he failed to construct a toilet. She has returned to her parents' house and made it clear that she will not return until the toilet is built.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X