ఎల్ఎన్ఎం వర్సిటీ నిర్లక్ష్యం: బికినీతో యువతి అడ్మిట్ కార్డు, వివాదాస్పదం

Subscribe to Oneindia Telugu

పాట్నా: బీహార్‌లోని దర్భంగాలో ఉన్న లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా, వర్సిటీ జారీ చేసిన ఓ అడ్మిట్ కార్డు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పరీక్షల కోసం అనుబంధ యూనివర్సిటీ విద్యార్థినికి లోదుస్తుల(బికినీ)తో ఉన్న మహిళ ఫొటోను అతికించిన అడ్మిట్ కార్డును జారీ చేసింది.

అడ్మిట్ కార్డు చూసి దిగ్భ్రాంతికి గురైన హోం సైన్స్ చదువుతున్న యువతి.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసింది. తన ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డును తిరిగి జారీ చేయాలని సోమవారం డిమాండ్ చేసింది. పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానుండడంతో సోమవారమే కొత్త అడ్మిట్ కార్డు ఇవ్వాలని కోరింది.

Bikini-Clad Womans Photo Adorns Degree Students Admit Card Issued By LNM University

అడ్మిట్ కార్డులో అన్ని వివరాలను సరిచూసుకున్నాక ప్రింట్ అవుట్ తీసుకున్న తాను షాక్‌కు గురయ్యానని, తన ఫొటోకు బదులుగా లోదుస్తులతో ఉన్న యువతి ఫొటో ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను సహించబోమని, వెంటనే అసభ్యకరంగా ఉన్న ఆ ఫొటోను తొలగించి విద్యార్థిని ఫొటోతో ఉన్న మరో అడ్మిట్ కార్డును జారీ చేయాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కులానంద్ యాదవ్ ఆదేశించారు.

సోమవారం మధ్యాహ్నం మరోమారు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోగా దానిపై ఫొటో, సంతకం లేకుండా ఖాళీగా కనిపించింది. దీంతో ఈ వ్యవహారం మరోమారు వివాదాస్పదమైంది. దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ తప్పు తమది కాదని చెప్పి తప్పుకున్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని నియంత్రణాధికారి యాదవ్ తెలిపారు. కాగా, ఇలాంటి తప్పులు వర్సిటీలో జరగడం ఇదే తొలిసారేం కాదు. గత సంవత్సరం కూడా ఓ విద్యార్థిని అడ్మిట్ కార్డుపై ఆమె ఫొటో కాకుండా గణపతి దేవుడి ఫొటోను ముద్రించడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In an apparent incident of administrative laxity, a final-year female student from Bihar's Lalit Narayan Mithila University has been issued a bizarre admit card for her examinations which is scheduled to begin tomorrow. Hindustan Times reported that a student of the university's affiliated college, SMJ College in Khajedih of Madhubani, found the photo of a woman in lingerie on her admit card.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X