వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా అమ్మాయిల్ని లక్ష్యంగా: బిషప్ వివాదాస్పద వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: మతాంతర వివాహాలు క్రైస్తవ విలువలు, నమ్మకాలకు విరుద్ధమంటూ కేరళలో ఒక క్యాథలిక్‌ బిషప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంజిరపల్లిలో శనివారం జరిగిన పాస్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇడుక్కి బిషప్‌ మార్‌ మాథ్యూ అనికుజికత్తిల్‌ మాట్లాడుతూ... ఇతర మతాలకు చెందిన అబ్బాయిలు క్రైస్తవ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. మిశ్రమ వివాహాలు క్రైస్తవ విలువలు, నమ్మకాలను నాశనం చేస్తాయన్నారు.

Bishop accuses Hindu outfit of love jihad by abducting Catholic girls from Christian faith

కేథలిక్ క్రిస్టియన్‌కు చెందిన యువతులను ఎత్తుకెళ్లి వివాహం చేసుకుంటున్నారని, ఇలాంటి లవ్ జిహాద్ సరికాదన్నారు. కులాంతర, మతాంతర వివాహాలు క్రిష్టియానిటీని దెబ్బతీస్తాయన్నారు. లవ్ జిహాద్‌లో భాగంగా తమ అమ్మాయిల్ని ఎత్తుకెళ్లడమే కొందరి ఉద్దేశ్యమన్నారు.

18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులతో కలిసి ఉండే యువతి, సండే చర్చ్‌కి వచ్చి పన్నెండు గంటల వరకు ఉంటే యువతి.. ఆ తర్వాత ముస్లీం లేదా ఆటో డ్రైవర్ లేదా హిందూ యువకుడితో వెళ్లిపోతుందంటే.. అది సరికాదని అభిప్రాయపడ్డారు.

English summary
Bishop accuses Hindu outfit of love jihad by abducting Catholic girls from Christian faith
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X