• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆమెకు 33.. అతనికి 21... బర్త్‌ డే కోసం హోటల్లో ఏకాంతంగా.. సరదాగా కొట్టడంతో మొదలైన గొడవ...

|

సరదాగా మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన వారి మధ్య సరదా గొడవ అగ్గిరాజేసింది. తనను ఆ కారణంగా కొట్టిందని ఆ వివాహితపై యువకుడు కసి పెంచుకున్నాడు. మాట మాట పెరిగింది. గదిలో ఇద్దరే ఉండటం, మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి... ఇంతలో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

పెళ్లి, పిల్లలు.. కానీ

పెళ్లి, పిల్లలు.. కానీ

న్యూఢిల్లీ శివారు అలీపూర్‌కు చెందిన ఓ వివాహితకు పెళ్లయ్యింది. భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె వక్రబుద్దిని చూపారు. ఓ 21 ఏళ్ల యువకుడు విక్కీ మాన్‌తో ప్రేమ మైకంలో మునిగిపోయింది. ఈ విషయం ఇంట్లో తెలియకపోవడంతో ఆమెకు అద్దు అదుపు లేకుండా పోయింది. అడిగేవారు లేకపోవడంతో రెచ్చిపోయింది.

ప్రియుడితో కలిసి

ప్రియుడితో కలిసి

అలీపూర్‌లో గల ఓయో హోటల్‌లో తన ప్రియుడు విక్కీతో కలిసి చాలాసార్లు వెళ్లింది. ఆ హోటల్ వారికి విక్కీ అండ్ కో కూడా బాగానే పరిచయం. అలా వారిద్దరూ సోమవారం రాత్రి కూడా వచ్చారు. అంతకుముందే ఆన్‌లైన్‌లో గది బుక్ చేసుకున్నారు. ఆమె బర్త్ డే కాబట్టి.. మందు, విందు చేసుకుంటున్నారు. ఇంతలో సరదాగా చేసిన చిలిపి పని వారి మధ్యలో చిచ్చురాజేసింది.

మద్యం సేవించి..

మద్యం సేవించి..

అసలే బర్త్ డే కావడంతో ఫుల్లుగా మద్యం సేవిస్తున్నారు. ఇంతలో వివాహిత తన ప్రియుడిని సరదాగా కొట్టింది. దానికి అతడు కూడా ఆమె మాదిరిగానే స్పందించాడు. ఆమెను కొట్టాడు. టపీమని కొట్టడంతో ఆమెకు చిర్రెత్తిపోయింది. మద్యం గ్లాసును విక్కీపై విసిరేసింది. ఇంకేముంది మాట మాట పెరిగిపోయింది. కోపోద్రిక్తుడైన విక్కీ.. ప్రియురాలి అని జాలీ కూడా చూడలేదు. గొంతునులిమి హత్య చేశాడు.

 దిగిన మైకం..

దిగిన మైకం..

వివాహితను హతమార్చాక తెలివి వచ్చిందో, మైకం దిగిందో తెలియదు కానీ.. ఏం చేయాలని ఆలోచించాడు. ఆమెను అలాగే వదిలేసి గది వదిలి వెళ్లిపోయాడు. ఇంతలో తనను కలిసిన హోటల్ సిబ్బందికి మళ్లీ వస్తానని చెప్పి జారుకున్నాడు. కానీ విక్కీ ఎంతకీ తిరిగిరాలేదు. మరునాడు టిఫిన్ తీసుకెళ్దామని సిబ్బంది ప్రయత్నించారు. కానీ ఎంతకీ డోర్ తీయరు. నెట్టిన లాభం లేకపోయింది.

మాస్టర్ తాళంచెవితో..

మాస్టర్ తాళంచెవితో..

చేసేది లేక హోటల్ సిబ్బంది మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. తమ వద్ద ఉన్న మాస్టర్ కీ తీసుకొని డోర్ తీశాడు. అయితే బెడ్ మీద వివాహిత నిర్జీవంగా పడి ఉంది. ముక్కు, నోటి నుంచి రక్తం కూడా కారింది. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. వారు హోటల్ వద్దకొచ్చి.. వివాహితను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. ఆమె చనిపోయారని వైద్యులు నిర్ధారించడంతో దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం చేశాక ఆమె మృతికి గల కారణం తెలుస్తోందని చెప్పారు.

ఫ్యామిలీ మెంబర్స్‌కు సమాచారం..

ఫ్యామిలీ మెంబర్స్‌కు సమాచారం..

హోటల్ బుక్ చేసే సమయంలో సమర్పించిన వివరాలను బట్టి వివాహిత కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. అలీపూర్ సమీపంలో ఉన్న యువకుడు విక్కీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహిత హత్య గురంచి ఆరాతీస్తున్నారు. కొట్టడంతోనే గొడవ జరిగిందా ? లేదంటే మరో కారణం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

రాత్రి పెద్ద శబ్ధం

రాత్రి పెద్ద శబ్ధం

సోమవారం రాత్రి వారి గది నుంచి పెద్దగా పాటల శబ్దం వచ్చిందని హోటల్ సిబ్బంది తెలిపారు. అయితే వారు తమ రెగ్యులర్ కస్టమర్లు అని.. బర్త్ డే వేడుకలు చేసుకుంటున్నారని పట్టించుకోలేదని సిబ్బంది చెప్పారు. అప్పుడే డోర్ కొట్టి ఉంటే దారుణం జరిగి ఉండేది కాదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

English summary
birthday turns into death day: A 33-year-old woman was murdered allegedly by her 21-year-old friend following an altercation during a birthday party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X