వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

65 ఏళ్ల వృద్దుడు, 22 కి.మీ దూరం.. కొండ కోనల్లో భార్యను మోస్తూ.. హతవిధి..

|
Google Oneindia TeluguNews

కరోనా జీవితాలను ఛిద్రం చేసింది. వర్షాలు రాకపోకలకు అంతరాయం కలిగించింది. వర్షాలతో కొండచరియలు విరిగిపడటం కామనే.. కానీ ఓ వృద్దుడికి మాత్రం శాపంగా మారింది. అనారోగ్యంతో ఉన్న తన భార్యను తీసుకెళ్లడానికి వీలు లేకుండా పోయింది. తన భుజాలపై తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. నిండు నూరేళ్లు తోడుంటానని మాట ఇచ్చినా.. ఆ ఇల్లాలు కన్నుమూయగా.. ఆమె భౌతికకాయం వద్ద వృద్దుడు గుండెలవిసేలా ఏడ్చాడు. ఈ ఘటనను ఓ యువకుడు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అదీ కాస్త వైరల్ అయ్యింది.

Alankrita Sahai: నమస్తే ఇంగ్లాండ్ యాక్ట్రెస్ హాట్ హాట్ గా ... మీరు చూడని ఫొటోస్Alankrita Sahai: నమస్తే ఇంగ్లాండ్ యాక్ట్రెస్ హాట్ హాట్ గా ... మీరు చూడని ఫొటోస్

భార్యకు అనారోగ్యం..

భార్యకు అనారోగ్యం..

ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది. చంద్‌సైలీ గ్రామానికి చెందిన సిద్ధాలిబై పడ్వీ అనారోగ్యానికి గురైంది. లోకల్ సబ్ హెల్త్ సెంటర్ మూసి ఉంది. దీంతో 22కి కిలోమీటర్ల దూరంలో రూరల్ హాస్పిటల్ ఉంది. ఆమె భర్త ఆడ్ల్యా పాడ్వీకి ఎలాంటి ట్రాన్స్ పోర్ట్ దొరకలేదు. అక్కడి నుంచి కాస్త దూరంలో రోడ్ బ్లాక్ అయిపోయి ఉంది. రవాణా ఆగిపోయింది. ఆమెను భుజానేసుకుని కొండదారుల్లో హాస్పిటల్‌కు బయల్దేరాడు. ఆ కొండ ప్రాంతాన్ని దాటేలోపే తన భుజాలపై ఉన్న భార్య తుది శ్వాస విడిచిందనే సంగతి గమనించాడు. ప్రాణం లేని భార్య ముందు కూర్చొని ఏడుస్తున్న వ్యక్తిని గమనించిన గ్రామస్థుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొద్ది రోజులుగా భార్య కడుపులో నొప్పి అని చెప్తుండటంతో దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడట.

purvimundada: వామ్మో ఏమిటి ఈ అందం ... టాప్ లెస్ ఫొటోలతో రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ (ఫొటోస్)purvimundada: వామ్మో ఏమిటి ఈ అందం ... టాప్ లెస్ ఫొటోలతో రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ (ఫొటోస్)

చనిపోయిన తర్వాత వచ్చీ

చనిపోయిన తర్వాత వచ్చీ

ఘటన జరిగిన తర్వాత జిల్లా అడ్మినిష్ట్రేషన్ అధికారులు, స్థానిక పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం చేరుకున్నారు. బ్లాక్ అయిపోయిన దారిని క్లియర్ చేశారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడగా.. పలు ప్రాంతాలు నీటమునిగాయి. అలా పాడ్వీ ఉన్న చోట కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. రాకపోలకు అంతరాయం కలిగింది. ఇంకేముంది తన భార్యను పొగొట్టుకోవాల్సి వచ్చింది. పాడ్వీ రోదనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇంతకుముందు కూడా

ఇంతకుముందు కూడా

ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. సమీపంలో ఆస్పత్రులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. భార్య/ తల్లి/ పిల్లలను మోసుకెళ్లారు. మరికొందరు అంబులెన్స్ కూడా ఇవ్వలేదు. ఆ ఘటనలు అన్నీ వార్తలుగా చూశాం. కానీ పరిస్థితి ఏ మాత్రం మారలే.. అవును ఏమీ మారలేదు. అంతా అలానే ఉంది. అందుకే పాడ్వీ తన భార్యను కోల్పోయాడు. ఆయనకు ట్రాఫిక్ క్లియర్ చేసి ఉంటే.. వివాహిత బతికేది. అదీ ఆయనకు కొండంత అండగా ఉండేది. కానీ విధి విచిత్రమో.. పాలకుల తప్పిదమో కానీ పాడ్వీకి భార్య మాత్రం దూరమైపోయింది.

English summary
woman died due to illness. her husband take to her his shoulders 22 kilometers but she is no more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X