గత ఎన్నికలకు బీజేపీ 4 వేల కోట్లు పోగేసిందా ? ఈసీ షాకింగ్ రిపోర్ట్..!

గత లోక్ సభ ఎన్నికలకు ముందు అంటే 2023-24 ఆర్ధిక సంవత్సరంలో దేశంలో వివిధ రాజకీయ పార్టీలు సేకరించిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘం ఆడిట్ రిపోర్ట్ బయటపెట్టింది. అంటే గత లోక్ సభ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఎంతెంత మొత్తం సేకరించి ఖర్చుపెట్టాయన్న దానిపై ఈ రిపోర్ట్ వివరాలు వెల్లడించింది. ఇందులో అధికార బీజేపీ అత్యధికంగా 83 శాతం ఆదాయం పెంచుకున్నట్లు ఈ రిపోర్టు చెబుతోంది.

గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఆర్ధిక సంవత్సరంలో బీజేపీ సేకరించిన విరాళాలు, ఇతరత్రా ఆదాయం కలిపి ఏకంగా 83 శాతం పెరిగి అంతకు ముందు ఏడాది ఉన్న రూ.2360 కోట్ల నుంచి రూ.4340 కోట్లకు చేరింది. గతేడాది ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు జూన్ 4న ప్రకటించారు. ఇందులో మోడీ నేతృత్వంలో బీజేపీ మూడోసారి గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టింది.

bjp acquired rs 4340 cr before 2024 lok sabha polls says EC s audit report

ఇక బీజేపీ ఆదాయ వనరులలో స్వచ్ఛంద విరాళాలు 2022-2023లో రూ.2,120.06 కోట్ల నుండి 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రూ.3,967.14 కోట్లకు పెరిగాయి. స్వచ్ఛంద విరాళాలలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లభించిన విరాళాలు కూడా ఉంటాయి. 2023-24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీకి రూ.1,685.6 కోట్లు వచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ మొత్తం ఆదాయంలో దాదాపు 38 శాతం ఈ బాండ్ల ద్వారానే వచ్చింది. మరే ఇతర పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా ఇంత భారీ ఆదాయం రాలేదు. ఈ బాండ్లను 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించి రద్దు చేసింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ఖర్చు రూ.1,092.15 కోట్ల నుండి ఎన్నికల ఏడాదిలో అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,754.06 కోట్లకు పెరిగిందని ఆడిట్ నివేదిక చెబుతోంది. ఇందులో రూ.591.39 కోట్లు ప్రకటనలు , ప్రచారానికి ఖర్చు చేశారు. ఇతర విరాళాలలో రూ.236.3 కోట్లు బీజేపీ నిధుల సేకరణ పథకం, రూ.2,042.7 కోట్లు ఇతర విరాళాల ద్వారా వచ్చాయి. వ్యక్తిగత దాతలు బిజెపికి రూ.240 కోట్లు, కార్పొరేట్లు రూ.1,890 కోట్లు, సంస్థలు, సంక్షేమ సంస్థలు రూ.101.2 కోట్లు విరాళంగా అందించారని నివేదిక పేర్కొంది.

మరోవైపు విపక్ష కాంగ్రెస్ ఆదాయం కూడా పెరిగినట్లు ఆడిట్ నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వార్షిక ఆదాయం 170 శాతం పెరిగింది.పార్టీ వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.452.4 కోట్లతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ రూ.1,225 కోట్ల ఆదాయాన్ని పొందింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్‌లుగా కాంగ్రెస్ పార్టీకి రూ.828.4 కోట్లు రాగా... 2022-23లో పార్టీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.171 కోట్లు పొందింది. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+