ఉత్తరాఖండ్ లో కొత్త సీఎం కోసం బీజేపీ వేట ప్రారంభం-పుష్కర్ థామీ రాజీనామా
ఉత్తరాఖండ్ లో బీజేపీ ఘన విజయంసాధించినా సీఎంగా ఉంటూ పరాజయం పాలైన పుష్కర్ థామీ ఇవాళ తన రాజీనామా సమర్పించారు. 70 సీట్ల ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 47 సీట్లు సాధించి బీజేపీ మరోమారు అధికారంలోకి వస్తున్న వేళ.. పుష్కర్ థామీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా తన రాజీనామాను ఇవాళ గవర్నర్ కు అందజేశారు. ఆయన్ను కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు మొదలయ్యాయి.
మరోవైపు ఉత్తరాఖండ్ సిట్టింగ్ సీఎం పుష్కర్ థామీ పరాజయంతో కొత్త సీఎం ఎంపిక కోసం బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ఇద్దరు కేంద్రమంత్రుల్ని డెహ్రాడూన్ కు పంపింది. బీజేపీ అధిష్టానం దూతలుగా అక్కడికి వెళ్లిన కేంద్రమంత్రులు కైలాష్ విజయ్ వర్గీయ, ప్రహ్లాద్ జోషీ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరో ఇద్దరు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ లను ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్ధిని ఎంపిక చేసే బాధ్యతను అధిష్టానం అప్పగించింది.వీరు త్వరలో డెహ్రాహూన్ రానున్నారు.

Recommended Video
ఉత్తరాఖండ్ కొత్త సీఎం రేసులో మాజీ సీఎం పుష్కర్ ధామీ ఉండకపోవచ్చని బీజేపీ వర్గాలు తెలిపాయి. థామీ ఇప్పుడు జాతీయ నాయకుడని కైలాస్ విజయ్ వర్గీయ తెలిపారు. అయితే, రాష్ట్రంలో ఎన్నికలను కూడా చూస్తున్న తేజిందర్ బగ్గా, "ధామీ మరోసారి" అని ట్వీట్ చేయడంతో, మరోసారి ధామీకి బీజేపీ అవకాశమిస్తుందా అన్న ఊహాగానాలకు ఆజ్యం పోసింది. మరోవైపు సీనియర్లు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్ ఇప్పటికే సీఎం రేసులో ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.












Click it and Unblock the Notifications