వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్వార్ ఆలయం కూల్చివేత దుమారం, కాంగ్రెస్ దురుద్దేశ పూర్వక ఘటన, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్‌లో గల అల్వార్ ఆలయం కూల్చివేత అగ్గిరాజేసింది. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వ దురుద్దేశ చర్యగా అభివర్ణించింది. అల్వార్‌ జిల్లా సారాయి మొహల్లలో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని స్థానిక అధికారులు రహదారి కోసం అని కూల్చివేశారు. ఆలయంతోపాటు 86 దుకాణాలు, ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. నగర అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్‌లో భాగంగా కూల్చివేతలు చేపట్టినట్టు తెలుస్తుంది.

ఇక్కడ వందల ఏళ్ల నాటి మూడు ఆలయాలని కూల్చివేయడం వివాదానికి దారితీసింది. పురాతన శివాలయం సహా మరో రెండు ఆలయాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. దీనిపై హిందూ సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలను కూల్చివేయడంపై బీజేపీ నాయకులు కూడా మండిపడ్డారు. నిజనిర్ధారణ కోసం ఒక కమిటీని కూడా నియమిస్తున్నట్టు తెలిపారు.

బీజేపీ ఆధీనంలో ఉన్న రాజ్‌గఢ్ పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ గత ఏడాది సెప్టెంబర్‌లో ఆక్రమణలను తొలగించి రహదారిని నిర్మించాలని తీర్మానం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్‌గఢ్ మున్సిపల్ కౌన్సిల్లో 35 మంది సభ్యులు ఉన్నారని, అందులో 34 మంది బీజేపీకి చెందినవారేనని కాంగ్రెస్ అంటోంది.

BJP calls Alwar temple demolition malicious act by Congress

కూల్చివేతలకు సంబంధించి బీజేపీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది. శికార్ ఎంపీ స్వామి సుమేధానంద్ మూడురోజులు పర్యటించి నివేదిక రూపొందిస్తారు. తర్వాత రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియాకు అందజేశారు. కమిటీలో చంద్రకాంత మెఘవాల్, రాజేంద్ర సింగ్ షెకావత్, బ్రజ్ కిశోర్ ఉపాధ్యాయ్, భవానీ మీనా ఉన్నారు.

కరౌలీ, జహంగిరిపురిలో జరిగిన ఘటన తర్వాత చూసి కన్నీరు వస్తోందని బీజేపీ నేత అమిత్ మాలవియా తెలిపారు. ఎలాంటి నోటీసు లేకుండా 18వ తేదీన 85 మంది హిందువుల షాపులు, పక్కా ఇళ్లను కూల్చివేశారు. రాజస్థాన్‌లో ఇంత జరుగుతున్న రాహుల్ గాంధీ ఎందుకు మిన్నకుండి పోయారని ప్రశ్నించారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది.

English summary
Bharatiya Janata Party has constituted a five-member committee to probe the demolition of 300-year-old Shiva temple in Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X